కొత్త పిలుపు: మోదీ సమేత కలువ కుంట జగన్

May 24, 2020
CTYPE html>
ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. జ‌గ‌న్ వెనుక ప్ర‌ధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్నార‌న్న‌ది నిజం. వెనుక అన్న మాట సాంకేతికంగా త‌ప్పంటారా?  అయితే.. వారితో చ‌క్క‌టి సంబంధాలు ఉన్నాయన్న మాట‌లో ఎలాంటి త‌ప్పు ఉండ‌ద‌ని చెప్పాలి. ఏపీ.. ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కంటే కూడా తెలంగాణ అధినేత మ‌న‌సుకు న‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టంతో జ‌గ‌న్ త‌ర్వాతే ఎవ‌రైనా.
 
బాబుతో దోస్తానా క‌ట్ అయిన వెంట‌నే జ‌గ‌న్ ను మోడీ చేర‌దీశార‌న్న పేరుంది. దీనికి త‌గ్గ‌ట్లే మోడీ స‌ర్కారు తీసుకునే ఏ నిర్ణ‌యాన్ని జ‌గ‌న్ త‌ప్పు ప‌ట్టిన దాఖ‌లాలు క‌నిపించ‌వు.  నిన్న‌టికి నిన్న విశాఖ రైల్వే జోన్ పేరుతో నాలుగున్న‌రేళ్లు క‌స‌ర‌త్తు చేసి.. ఎలాంటి ఆదాయం రాని జోన్ ను సిద్దం చేసి ఏపీకి ఇచ్చేశామ‌ని చేతులు దులుపుకోవ‌టం.. దానిపై జ‌గ‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క వ్యాఖ్య కూడా చేయ‌ని దుస్థితి. 
 
ఇదొక్క‌టి చాలు.. ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలోజ‌గ‌న్ క‌మిట్ మెంట్ ఏమిట‌న్న‌ది అర్థం చేసుకోవ‌టానికి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు.. ప్ర‌ధాని మోడీకి మ‌ధ్య‌న సీక్రెట్ రిలేష‌న్ ఉంద‌న్న ఆరోప‌ణ ఉంది. రేపొద్దున ఏదైనా తేడా వ‌చ్చి మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మైతే మోడీకి ఆయ‌న ఇస్తార‌ని చెబుతారు.అదే స‌మ‌యంలో బీజేపీ మీదా.. ప్ర‌ధాని మీదా త‌ర‌చూ కేసీఆర్ విమ‌ర్శ‌లు చేస్తుంటారు. అయితే.. ఆయ‌న పెద‌వి విప్పిన ప్ర‌తిసారి తెలంగాణ ప్ర‌యోజ‌నాలకు ఇబ్బంది వాటిల్లిన‌ప్పుడేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.
 
ఇలాంటి క‌మిట్ మెంట్ జ‌గ‌న్ లో అస్స‌లు క‌నిపించ‌దు. రాష్ట్రప్ర‌యోజ‌నాల గురించి ఆయ‌న ప‌ట్టించుకున్న‌ట్లు ఉండ‌దు. ఎంత‌సేపు సీఎం కుర్చీలోకూర్చోవాల‌న్న త‌ప‌న త‌ప్పించి.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు.. రాష్ట్ర హ‌క్కుల గురించి గ‌ళం విప్పాల‌న్న ధ్యాస‌లో ఆయ‌న‌లో ఉన్న‌ట్లుగా అనిపించ‌దు. మొక్కుబ‌డిగా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం నినాదాలు చేసే జ‌గ‌న్‌.. అందుకు త‌గ్గ‌ట్లుగా సీరియ‌స్ గా జాతీయ స్థాయిలో ఏదైనా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారా?  ఎవ‌రైనా అగ్ర‌నేత నుంచి హామీ పొందారా? అంటే నో అనే మాటే వినిపిస్తుంది.
 
త‌ల కిందులు త‌ప‌స్సు చేసినా.. మోడీ మాష్టారు ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ర‌న్న‌ది క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లే. ఇక‌.. ఇచ్చే ఆశ ఒక్క కాంగ్రెస్ మీద‌నే ఉంది. విభ‌జ‌న కార‌ణంగా తాను చెల్లించిన మూల్యం ఎంత ఖ‌రీదైనద‌న్న‌ది ఆ పార్టీ అగ్ర నాయ‌క‌త్వానికి బాగా తెలుసు. సొంత పార్టీ నేత‌ల మాట‌ల‌తో తామింత‌గా మోస‌పోతామ‌ని.. అధికారానికి దూర‌మ‌వుతామ‌ని.. ఆస్తిత్వం సైతం ప్ర‌శ్నార్థ‌కం అవుతుంద‌న్న‌ది వారెప్పుడూ ఊహించి ఉండ‌రు. అందుకే.. పోయిన చోట వెతుక్కోవాల‌న్న సంక‌ల్పం కాంగ్రెస్ లోకొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. తాము కానీ అధికారంలోకి వ‌స్తే ఎవ‌రు ఏమ‌న్నా స‌రే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న అంశంపై రాహుల్ మాట‌లో క‌మిట్ మెంట్ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది.
 
ఇలాంటి వేళ‌లో.. రాహుల్ తో జ‌గ‌న్ చేతులు క‌ల‌పొచ్చు క‌దా?  ఒక‌వేళ హోదా ఇస్తే.. కాంగ్రెస్‌కు తాను మ‌ద్ద‌తు ఇవ్వ‌టానికి సైతం సిద్ధ‌మ‌న్న మాట‌ను ఆయ‌న ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నారు? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. 
 
ఎన్నిక‌ల్లో అన్ని విధాలుగా సాయం చేస్తాన‌ని ముందుకొచ్చిన కేసీఆర్ మీద జ‌గ‌న్ భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ కార‌ణంతోనే ఆయ‌న డైరెక్ష‌న్ లో న‌డుస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. లేకుంటే.. కేసీఆర్ అమితంగా న‌మ్మే చిన జీయ‌ర్ స్వాములోరిని జ‌గన్ క‌ల‌వ‌టం.. ఆయ‌న ఆశీస్సులు పొంద‌టం చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఏపీ రాజ‌కీయ చిత్రాన్ని కేసీఆర్ డైరెక్ష‌న్ లో న‌డిపేందుకు జ‌గ‌న్ ఓకే అన్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. ఈ కార‌ణంతోనే కావొచ్చు.. ఏపీ మంత్రి లోకేశ్ ఆస‌క్తిక‌ర పోస్ట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. జ‌గ‌న్ ను ఆయ‌న‌.. మోదీ సమేత కలువ కుంట‌ జగన్ గా అభివ‌ర్ణించారు. క‌లువ కుంట అంటే లోట‌స్‌పాండ్ అని అర్థ‌మ‌ట‌. ఈ పిలుపు కొత్త‌గా ఉండ‌ట‌మే కాదు.. అంద‌రి నోట నాన‌టం ఖాయ‌మంటున్నారు. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.