ఏపీ రెడ్ జోన్ మండలాల కొత్త లిస్టు - మీ మండలం ఉందా?

August 08, 2020

జులైలో ఏపీలో కోవిడ్ విశ్వరూపం చూపుతోంది. 11 రోజుల్లోనే అనూహ్యమైన స్థాయిలో కేసులు పెరిగాయి. దాదాపు రెట్టింపు కేసులయ్యాయి. దీంతో ఏపీలో పరిస్థితులు అదుపు తప్పాయి. అందుకే ఏపీ ప్రబుత్వం కొత్తగా ఏపీలో మండలాలను జోన్లు విభజించింది. రెడ్ జోన్ల వివరాలను ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరి మీ మండలం రెడ్ జోన్లో ఉందో లేదో ఎక్కడో కష్టపడి వెతకాల్సిన అవసరం లేదు. 

ఇదిగో రెడ్ జోన్ మండలాల లిస్టు ఇస్తున్నాం.. అంటే వీటిలో ఇతర మండలాల కంటే అత్యధిక కేసులు నమోదై వేగంగా కరోనా వ్యాపిస్తోంది.

విశాఖపట్నం - 3 : 

విశాఖ (పట్టణ), పద్మనాభం, నర్సీపట్నం (పట్టణ).

తూర్పుగోదావరి - 8 :

శంఖవరం గ్రామీణ, కొత్తపేట, కాకినాడ రూరల్, పిఠాపురం టౌన్, రాజమండ్రి అర్బన్, అడ్డతీగల, పెద్దాపురం టౌన్, రాజమహేంద్రవరం రూరల్.


పశ్చిమగోదావరి -9 : 

ఏలూరు అర్బన్, పెనుగొండ రూరల్, భీమవరం టౌన్, తాడేపల్లిగూడెం అర్బన్, ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు టౌన్, నరసాపురం టౌన్, 

కృష్ణా -5 : 

విజయవాడ అర్బన్, పెనమలూరు గ్రామీణ, జగ్గయ్యపేట టౌన్, నూజివీడు టౌన్, మచిలీపట్నం అర్బన్

గుంటూరు -12 : 

గుంటూరు అర్బన్, నరసరావుపేట, మాచర్ల టౌన్, అచ్చంపేట గ్రామీణ, మంగళగిరి టౌన్, పొన్నూరు టౌన్, చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి టౌన్,

కర్నూలు -17 :

కర్నూలు అర్బన్, నంద్యాల, బనగానపల్లి గ్రామీణ, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు టౌన్, నందికొట్కూరు టౌన్, కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు టౌన్, ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు టౌన్,

ప్రకాశం  -9 : 

ఒంగోలు అర్బన్, చీరాల (పట్టణ), కారంచేడు, కందుకూరు (పట్టణ), గుడ్లూరు, కనిగిరి (పట్టణ), కొరిసపాడు, మార్కాపురం (పట్టణ), పొదిలి

నెల్లూరు -14 : 

నెల్లూరు (పట్టణ), నాయుడుపేట (పట్టణ), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు (పట్టణ), కావలి (పట్టణ), కోవూరు, ఓజిలి, తోటపల్లిగూడూరు

చిత్తూరు - 8 : 

శ్రీకాళహస్తి (పట్టణ), తిరుపతి (పట్టణ), నగరి (పట్టణ), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు

కడప - 7 : 

ప్రొద్దుటూరు (పట్టణ), కడప (పట్టణ), బద్వేలు (పట్టణ), పులివెందుల (పట్టణ), మైదుకూరు (పట్టణ), వేంపల్లె, ఎర్రగుంట్ల (పట్టణ)

అనంతపురం - 5: 

హిందూపురం (పట్టణ), అనంతపురం (పట్టణ), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు

ఎందుకు వీటిని ప్రకటించారు ?

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను ఈ ప్రాంతాల్లో కఠినంగా అమలుచేయాలని ఏపీ ప్రభుత్వం కలెక్టర్లను కోరింది. ఈ రెడ్‌జోన్లలో 14 రోజులు కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్‌ జోన్ గా మారుస్తారు. ఆ తర్వాత మరో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు ఒక్కటీ రాకపోతే అప్పుడు గ్రీన్‌జోన్‌ గా మారుస్తారు.