మహేష్ ఏం చేశాడో మీకర్థమవుతుందా?

May 28, 2020

సంక్రాంతికి విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమాల్లో సరిలేరు నీకెవ్వరు ఒకటి. సంక్రాంతి విజేత అనే కన్నా.. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనసారా నవ్వుకునే ఛాన్స్ ఉన్న సినిమాగా చెప్పొచ్చు. మహేశ్ కెరీర్ లో చాలా కాలం తర్వాత మాస్ గా చేసి మనసు దోచేసిన ఈ బొమ్మకు మరింత బూస్టు ఇచ్చే కార్యక్రమాన్ని షురూ చేశారు.
బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ చిత్రంలో ఒక హిలేరియస్ కామెడీ సీన్ ను యాడ్ చేశారు.రావు రమేశ్ ఫ్యామిలీతో మహేశ్ నవ్వులు పూయించే ఈ సీన్ ఈ రోజు (శనివారం) నుంచి మార్నింగ్ షోలో అన్ని థియేటర్లలో యాడ్ చేసి వదులుతున్నారు. ఈ సీన్ తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చంటున్నారు.
అదనంగా యాడ్ చేస్తున్న ఈ సీన్ ఎలా ఉంటుందన్న ఆసక్తికర చర్చ షురూ అయ్యింది. మరి.. అదనంగా యాడ్ చేసిన సీన్ చూడాలంటే దగ్గర దగ్గర మూడు గంటల సినిమా మళ్లీ చూసేయాలన్న మాట. అసలు విషయం మీకు.. అర్థమవుతుందా అని?