నా కెరీర్‌లోనే ఇలాంటి పరిస్థితి చూడలేదు: కరోనాపై న్యూయార్క్ డాక్టర్

August 07, 2020

కరోనా మహమ్మారి కరోనా కేసులు, మృతుల కేంద్రంగా మారింది అమెరికాలోని న్యూయార్క్. అమెరికాలో 1,45,00కు పైగా కేసులు, 2,600కు పైగా మృతులు ఉన్నారు. ఇందులో 60 వేలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మృతులు న్యూయార్క్‌లోనే ఉన్నాయి. అమెరికాలోని దాదాపు సగం కేసులు ఇక్కడివే. ఆసుపత్రుల్లో 80శాతం కంటే ఎక్కువమంది రోగుల్లో కరోనా లక్షణాలు ఉన్నాయి. క్రిటికల్ కేర్ డాక్టర్లు, నర్సులు రోగులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుల్ జైదీ అనే ఓ డాక్టర్ కరోనా వైరస్ గురించి ఏం చెప్పారంటే..

ఈయన గత తొమ్మిదేళ్లుగా క్వీన్స్‌లోని లాంగ్ ఐస్‌లాండ్ జ్యూయిష్ మెడికల్ సెంటర్‌లో క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్నారు. కరోనా వైరస్ చాలా భయంకరంగా మారిపోయిందని, తాను ఐసీయూ డాక్టర్‌ను అని, ఈ ఒత్తిడి తమకు అలవాటయిందని, సాధారణ ప్రజలు చూడని అంశాలు తాము చూస్తామని, ఏమయినప్పటికీ తన కెరీర్‌లోనే అత్యంత భయంకర మహమ్మారి ఇది అని డాక్టర్ చెప్పారు. తమకు కనీసం కూర్చోవడానికి, తినడానికి, బాత్రూం వెళ్లేందుకు కూడా సమయం దొరకడం లేదన్నారు. కచ్చితంగా తప్పదు అనుకుంటేనే కదులుతున్నామన్నారు. అసలు తాను కంటినిండా నిద్రపోయింది ఎప్పుడో కూడా గుర్తుకు లేదని, బహుశా కరోనా మహమ్మారి చికిత్స ప్రారంభానికి ముందు నిద్రపోయి ఉంటానని చెప్పారు.

నార్త్‌వెల్ హెల్త్ సిస్టంలోని 23 హాస్పిటల్స్‌లలో ఒకటైన లాంగ్ ఐస్‌లాండ్ మెడికల్ సెంటర్‌లో డాక్టర్ మంగల నరసిహంహన్ క్రిటికల్ కేర్ చీఫ్‌గా ఉన్నారు. వీరు మాట్లాడుతూ... తాను ఉంటున్న ఐసీయూలో 18 బెడ్స్‌లో రోగులు వెంటిలెటర్స్‌పై ఉన్నారని, వారు కనీసం కళ్లు కూడా తెరవలేకపోతున్నారని, కుటుంబంతో మరెవరితో మాట్లాడలేకపోతున్నారని చెప్పారు. వారికి ట్యూబ్స్ ద్వారా తాము తినిపించుతున్నామని, వీరంతా తమ ఐసీయూలోని ప్రతి గతిలో ఉన్నారన్నారు. గత వారం రోజుల్లో న్యూయార్క్ సిటీ హాస్పిటల్లో 5,000 మందికిపైగా కరోనా పేషెంట్లను అడ్మిట్ చేసినట్లు చెప్పారు.

ఇందులో మూడింట ఒకవంతు మంది ఇంటెన్సివ్ కేర్‌కు వెళ్తున్నట్లు చెప్పారు. కొద్ది గంటల్లోనే వారు ఆసుపత్రికివచ్చి, ఆ తర్వాత వెంటిలెటర్ మీదకు వెళ్లి ప్రాణాలతో పోరాడుతున్నారన్నారు. ఇలాంటివి చూడటం చాలా అసాధారణమని, ఇలాంటి వ్యాధిని చూడలేదన్నారు. చాలా రోజుల పాటు వెంటిలెటర్ పైన ఉంటున్నారన్నారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను ఆసుపత్రిలోకి కూడా అనుమతించడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, అలాగే, కొంతమందికి నయమైందని మంగళ నరసింహన్ చెప్పారు. తాను చికిత్స అందించిన అతి పిన్న వయస్కుడికి 21 ఏళ్లు ఉంటాయన్నారు. వెంటిలెటర్ తీసేశామని, ఆయన బాగవుతాడని ఆశ అన్నారు.