గుంటూరు అభ్య‌ర్థులను తేల్చిన బాబు...అలీది స‌స్పెన్స్‌

December 14, 2019
CTYPE html>
వచ్చే ఎన్నికల్లో రాజ‌కీయ ప్ర‌వేశానికి ఫిక్స‌యిపోయారు న‌టుడు అలీ. గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంపై ఆయ‌న మ‌న‌సు ప‌డ్డారు. చంద్ర‌బాబును కూడా ప‌లుమార్లు క‌లిశారు. అయితే, అలీ ను చంద్ర‌బాబు ఇంకా స‌స్పెన్స్‌లోనే పెట్టారు. మొన్న బాప‌ట్ల ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలోని అభ్య‌ర్థుల‌ను ఖ‌రారుచేసిన చంద్ర‌బాబు తాజాగా గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఈరోజు ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో స‌మీక్ష నిర్వ‌హించిన చంద్ర‌బాబు అనంత‌రం అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించారు. 
 
గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ కు మ‌ళ్లీ నిల‌బ‌డుతున్నారు. ఈమేర‌కు చంద్ర‌బాబు ఖ‌రారుచేశారు. మిగ‌తా సీట్ల‌కు అభ్య‌ర్థుల లిస్టు ఇదే.
పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర, 
తెనాలి - ఆలపాటి రాజా, 
తాడికొండ - తెనాలి శ్రవణ్‌కుమార్‌ 
గుంటూరు తూర్పు-పెండింగ్‌
గుంటూరు ప‌శ్చిమ - పెండింగ్‌
ప్ర‌త్తిపాడు - పెండింగ్‌
మంగ‌ళ‌గిరి - పెండింగ్‌
 
అయితే, ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశం అసంపూర్తిగా ముగిసింది. మ‌రోసారి సోమవారం గుంటూరు జిల్లా పార్టీ నేతలతో చంద్ర‌బాబు స‌మావేశం కానున్నారు. పెండింగ్‌లో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా రేపు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. అయితే, మిగతా జిల్లాల‌తో పోలిస్తే రాజ‌ధాని ఉన్న‌ గుంటూరు జిల్లాల‌లో ప్ర‌తిసీటుకు భారీ కాంపిటీష‌ను ఉండ‌టంతో స‌మావేశం పూర్తి కాలేదు.