ఎన్జీటీ ఎంటరైంది... జగన్ కి, ఎల్జీ పాలిమర్స్ కి ఇక చుక్కలే

August 06, 2020

మరణాల సంఖ్యను, జగన్ పరిహారాన్ని చూసి ఈ సమస్య సమసిపోయింది అనుకుంటున్నారు కొందరు. కథ ఇపుడే మొదలైంది. ఇది అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించిన పెద్ద సమస్య. ఈ కేసును ఎంత మంది చనిపోయారు అన్న కోణంలో డీల్ చేయరు. ఇది తరతరాలను, ఒక ప్రాంతాన్ని నాశనం చేయగలిగిన సమస్యగా పర్యావరణ నియంత్రణ సంస్థలు భావిస్తాయి. ఆ కోణంలోనే విచారణ చేస్తాయి. నిన్న మానవహక్కుల సంఘం రంగంలోకి దిగి జగన్ కు చెమటలు పట్టించింది. తాజాగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ The National Green Tribunal (NGT) ఈ దుర్ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ వెంటనే స్థానిక కోర్టులో 50 కోట్లు డిపాజిట్ చేయమని ఎల్జీ పాలిమర్స్ ఇండియా లిమిటెడ్ (LG polymers India ltd) ను ఆదేశించింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, మోడీ సర్కారుకు, ఎల్జీ పాలిమర్స్ కు, సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డుకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. అసలు సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలతో హాజరు కావాలని, సమస్య అనుపానులు మొత్తం సమర్పించి దాంతో పాటు ఘటనపై దర్యాప్తు నివేదిక అందివ్వాలని ఆదేశించింది.

ఎన్జీటీ ఛైర్ పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ తదుపరి దీని గురించిన విచారణ, దర్యాప్తు, పరిశీలన కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని బి శేషశయనరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసింది. మే 18లోపు ఈ సంఘటనపై దర్యాప్తు చేసి కమిటీ నివేదిక ఇవ్వనుంది. రూ.50 కోట్లు స్థానిక కోర్టులో డిపాజిట్ చేయడంతో పాటు ఎన్జీటీ తదపరి ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని, కంపెనీ సామర్థ్యం, భవిష్యత్తు వీటన్నింటి మీద దర్యాప్తు అనంతరం నిర్ణయాలు వెల్లడిస్తామని ఎన్జీటీ పేర్కొంది. 

ఇది కేవలం కొన్ని ప్రాణాలను తీసిన దుర్ఘటనగా చూడలేం. ఇది ప్రకృతి మీద దాడి. పాడి, పంట, నేలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపింది. పరిసర ప్రాంతాల భవిష్యత్తును చిద్రం చేసింది అని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. దేశంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అత్యున్నత పర్యావరణ నియంత్రణ సంస్థ. దేశంలో అన్ని పరిశ్రమలు దీని నిర్ణయాలకు, తీర్పుకు కట్టుబడి ఉండాల్సింది. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు కాదు కదా, సాగునీటి ప్రాజెక్టులు కూడా నడపలేం.