వైరల్ అవుతున్న నేపాలీ రెస్టారెంట్ బోర్డు ... చూస్తే షేర్ చేస్తారు

August 11, 2020

మంచి మనసు ఈ ప్రపంచాన్ని కాపాడుతుంది... నిజాయితీ నిలబెడుతుంది.

అతనికి మంచి మనసు ఉంది... మీకు నిజాయితీ ఉందో లేదో తేల్చుకోవాల్సింది మీరే.

కరోనా వల్ల ప్రపంచమంతా లాక్ డౌన్ అయ్యింది. అత్యధిక దేశాలు లాక్ డౌన్ లో ఉండటమో లేదంటే అంతర్జాతీయ విమానాలు ఆపేయడం ఏదో ఒకటి చేశాయి. దీనివల్ల ఎంతో మంది నాన్ లోకల్స్ చాలా చోట్ల చిక్కుకుపోయారు. అలా స్టక్ అయిపోయన వారిని మనసున్న వారు ఆదుకుంటున్నారు. ఒక నేపాలీ రెస్టారెంట్... తమ ప్రాంతంలో ఇరుక్కుపోయిన వారిని ఆదుకోవడానికి ముందుకువచ్చింది. ఇందుకోసం వారు ఏర్పాటుచేసిన బోర్డు అందరినీ మనసులు చూరగొంది. మీరు మా దేశంలో ఇరుక్కుపోయారా? ఏం పర్వాలేదు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా కడుపునిండా తినండి. డబ్బులుంటే డబ్బులిచ్చి తినండి అంటూ తన హృదయాన్ని చాటుకున్నారు. చివర్లో మనందరం ఐకమత్యంగా ఉందాం. కీప్ లవింగ్ నేపాల్ అంటూ రాసి ఉన్న ఆ బోర్డు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.