బాహుబలి 3 కి రెడీ అయిపోయింది

September 17, 2019

నిధి అగర్వాల్... ఇటీవల కుర్రాళ్లను బాగా రెచ్చగొడుతున్న టాలీవుడ్ భామ. ప్రస్తుతం రామ్-పూరీ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కథానాయికగా చేస్తున్న నిధి ఇంకా అసలే ప్రకటించిన బాహుబలి-3 కి ఖర్చీఫ్ వేసింది. అలాంటి సినిమాలో నటించడం ఏ నటికి అయిన చాలా గొప్ప అచీవ్ మెంట్ అని.. అందుకే బాహుబలి 3కి ఎలాంటి కండిషన్స్ మీద నటించడానికైనా తనకు సమ్మతమే అంటోంది నిధి. నెక్లెస్ రోడ్ లోని పార్క్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది.

ఇక ఈమె గురించి చెప్పాలంటే...

2017లో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది

2018లో సవ్యసాచిలో నటించింది

2019లో మిస్టర్ మజ్నుతో ప్రేమాయణం

తాజాగా ఇస్మార్ట్ శంకర్ తో మన ముందుకు వస్తోంది. ఖాళీ దొరికితే టూర్లకు వెళ్లడం పిచ్చి. టూర్లు బాగా వేస్తుంది.