NIHARIKAK15 ఈ కోడ్ వాడితే 15 శాతం డిస్కౌంట్

August 12, 2020

మెగా డాటర్ నిహారిక మోస్ట్ యాక్టివ్ కిడ్. పేజ్ 3 పీపుల్లో బాగా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మాయి సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ అయిపోదామని ట్రై చేసినా ఫలితం దక్కలేదు.

కొన్ని సినిమాలు చేసినా ఆడలేదు. ఈవెంట్స్ అనీ, పీఆర్ అనీ రకరకాల పనులు చేస్తుంటుంది.

పెళ్లీడుకొచ్చిందని నాగబాబు పెళ్లి సంబంధం చూసిపెట్టారు. ఒకరకంగా ప్రేమపూర్వక పెళ్లి అనుకోండి.  

త్వరలో మెగా ఫ్యామిలీకు సన్నిహితులైన జొన్నలగడ్డ కుటుంబంలో అడుగుపెట్టబోతుంది. అంతేకాదు తనకు కాబోయే భర్త జొన్నలగడ్డ చైతన్యతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి బాగా వైరల్ అయ్యాయి.

ఆగస్టు 13న ఎంగేజ్మెంట్ అట. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.

ఈ ఫొటోలో ఒక విశేషం ఉంది.  ఒక మల్టీ నేషనల్ బ్రాండ్ డేనియల్ వెల్లింగ్‌టన్ న్యూ ఎవర్ గ్రీన్ గోల్డ్  రిస్ట్ వాచ్ కొనిందట.

తన చేతికి పెట్టుకున్నది అదేనట. బాగుంది కదా.. మీరు కూడా కొనుక్కుంటే మీకు డిస్కౌంట్ ఇప్పిస్తా అంటోంది. NIHARIKAK15 అనే కోడ్‌ చెక్ అవుట్ సమయంలో ఉపయోగిస్తే 15 శాతం డిస్కౌంట్ వస్తోందట.

చూద్దాం అని మేము ఆ సైట్లోకి వెళ్లాం. ఆమె చెబుతున్న వాచ్ ధర 9899 రూపాయలు. ఆమె చెప్పిన కోడ్ అప్లై చేస్తే నిజంగానే ₹-1,484.85 డిస్కౌంట్ వచ్చింది.

ఆ వాచే కాదు, ఏం కొన్నా కూడా ఆ డిస్కౌంట్ వస్తోంది. 

మరి మెగాడాటర్ ఈ వాచ్ ను ఎందుకు ప్రమోట్ చేస్తోందబ్బా? ఏమైనా దానికి ప్రమోటింగ్ వర్క్ చేస్తోందా? పీఆర్ ఏమైనా చేస్తోందా? ఏమో మరి. 

Read Also

అమరావతిలో అంబేద్కర్ అడ్రస్ చెరిపేసిన జగన్
క్లినికల్ ట్రయల్ దశలో ఉన్న వ్యాక్సిన్లు ఎన్ని ?
జూలై 6, జూలై 13 నుండి ఐ-ప్లై విన్నర్స్ వర్క్ షాప్ కోర్సులు