నిహారిక... ఇక మిసెస్ నిహారిక !!

August 05, 2020

ఆరు నెలలుగా నాగబాబు కూతురి పెళ్లి గురించి చెబుతూనే ఉన్నారు. బహుశా అప్పటి నుంచే సంబంధాలు చూడటం మొదలుపెట్టినట్టున్నారు. తాజాగా సంబంధం కుదిరింది. నిహారిక ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది.

దీంతో నాగబాబు కూతురు నిహారిక కొణిదెల త్వరలోనే మరో ఇంటి కోడలిగా మారబోతోంది. నిహారిక తాత పోలీసు, నిహారిక మామ కూడా పోలీసే. అవును నిహారిక చేసుకోబోయే అబ్బాయి పోలీసు అధికారి కూతురు.

తొలుత పేరు వివరాలు గోప్యంగా ఉంచారు. కానీ మెగా ఫ్యామిలీ వార్తలు బయటకు రాకుండా ఉండవు కదా. బయటపెట్టేశారు. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో నిహారిక ఎగ్జైటింగ్ గా పోస్ట్ చేసింది. 

మిస్ తీసేసి మిసెస్ అని పెట్టడం ద్వారా రహస్యాన్ని రివీల్ చేసింది నిహారిక.  టీజర్ లాగా వరుడి మొహం కనిపించకుండా వరుడిని హగ్ చేసుకున్న ఫొటో పెట్టింది. 

అయితే చాలా వేగంగా వరుడు చైతన్య అని అతని ఫొటో బయటకు వచ్చింది. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య నిహారిక కాబోయే భర్త అని అంటున్నారు.

వరుడు చైతన్య జొన్నలగడ్డ బిట్స్ పిలాని విద్యార్థి అట.