నైతిక బాధ్యతతో నీలం సహానీ రాజీనామా చేస్తారా?

June 03, 2020

కరోనా ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు ఏపీ ఎన్నికల కమిషనర్ లోకల్ బాడీ ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే... ఏపీ సీఎస్ నీలం సహానీ వెంటనే నిమ్మగడ్డకు రమేష్ ఎన్నికలు వాయిదా వేయకుండా యతాతథంగా నిర్వహించమంటూ లేఖ రాశారు. ఇది ఎవరు రాయించారో అందరికీ తెలుసు. కరోనా వైరస్ సాకుతో ఎన్నికలు వాయిదా వేయొద్దన్నారు. ఇక్కడ సాకు అనే పదం వాడటం ఘోరమైన అవమానం. 

ఆమె లేఖలో ప్రధానమైన కంటెంట్... ‘ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపివుంటే కరోనాపై వాస్తవ నివేదికను అందించేవాళ్ళం. వైద్య శాఖ స్పెషల్ సీఎస్ ఇచ్చిన నివేదికను కూడా పంపించేందుకు సిద్ధం చేశాం. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికుడికి స్క్రీంనింగ్ చేసి, ఇంటింటికి వెళ్లి వైద్యసేవలు అందించే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల పాలకవర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. కరోనా నియంత్రణ చర్యలకు స్థానిక సంస్థలు చాలా ఉపయోగపడతాయి. మరో 3, 4 వారాల్లో కరోనా రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ముందస్తుగా అవసరమైన చర్యలు తీసుకున్నాం. ఎన్నికల సంఘం తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి’ అని కోరారు.

అంటే ఆమె లేఖ ప్రకారం... ఏపీలో కరోనా లేదు. ఏ విధంగా అది రాష్ట్రంలోని ప్రవేశిస్తుంటే...వాటన్నింటినీ  చెక్ చేశాం అని చెప్పారు. ఇది శుద్ధ తప్పు. ఎందుకంటే.. ఆమె లేఖ రాసిన సమయానికి ఏపీలో 200 కరోనా కేసులున్నాయి. అవి మార్చి 29 తర్వాత బయటపడ్డాయి. కానీ వాస్తవానికి తబ్లిగి జమాత్ కు హాజరైన వారు సీఎస్ లేఖ రాసే సమయానికి ఏపీకి తిరిగి వచ్చే శారు. ఎన్నికలు 21 నుంచి జరగాల్సి ఉంది. ఎన్నికలు కనుక అలాగే జరిగి ఉంటే...ఆ 200 మంది కేవలం వారం రోజుల్లో లక్షల మందికి అంటించే వాళ్లు. దీంతో రాష్ట్రం పరిస్థితి ఇటలీ కంటే ఘోరంగా ఉండేది. కానీ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా తప్పు లేఖ రాసిన వ్యక్తి సీఎస్. కేంద్రంతో మాట్లాడి ప్రమాదాన్ని అంచనా వేసి ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ వంద శాతం రైట్. 

ఆయన కనుక లేకపోయి ఉంటే... నీలం సహానీ, జగన్ కూడా హాహా కారాలు చేసే పరిస్థితి. జగన్ పదవి కూడా పోయేది. వైసీపీ ఆరోపించినట్టు జగన్ నిందలు వేసినట్టు నిమ్మగడ్డ కాపాడింది రాష్ట్రాన్ని... చంద్రబాబును కాదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఎంత మంది కరోనా సోకిన వారు ఉన్నారో తెలుసుకోకుండా ఎవరో చెబితే లేఖ రాసిన నీలం సహానీ తన పదవికి రాజీనాా చేస్తారా? లేక నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతారా?