ఏపీ సీస్ సహానీ సంచలన నిర్ణయం?

May 30, 2020

ఏపీలో అధికార వికేంద్రీకరణ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆ ప్రతిపాదనపై చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. అమరావతి నుంచి రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రతిపక్షాలతో పాటు పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అధికార వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అమరావతి రాజధాని రైతులు తీవ్రంగా నష్టపోతారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు అమరావతి రైతుల ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోన్నప్పటికీ....ప్రభుత్వం మాత్రం మొండిగా వికేంద్రీకరణకు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో ఈ తరలింపు వ్యవహారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.
అధికారణ వికేంద్రీకరణ నిర్ణయం ఎఫెక్ట్ తో నీలం సహానీ ఏకంగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి కార్యాలయాలను విశాఖ, కర్నూలుకు తరలిస్తే అధికారులను బాధ్యులను చేస్తామని హైకోర్టు బల్లగుద్ది మరీ చెప్పింది. ఈ క్రమంలోనే పలువురు అధికారుల పరిస్థితి ముందు నుయ్యి...వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. ఓ వైపు కో్ర్టు ఆదేశాలను ధిక్కరించలేని పరిస్థితి....మరోవైపు విశాఖనుంచి పాలన ప్రారంభించాలని ప్రభుత్వం వడివడిగా పావులు కదుపుతున్న వైనం...వెరసి...పలువురు అధికారులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఇటు ప్రభుత్వానికి మద్దతుగా పనిచేయలేక...కోర్టు ఆదేశాలను ధిక్కరించలేక....ఏపీ సీస్ సహానీ డైలమాలో పడ్డారట. ఈ నేపథ్యంలో ఆమె లాంగ్ లీవ్ మీద వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ఆమెతోపాటు మరికొందరు ఐఏఎస్ లు కూడా ఇదే యోచనలో ఉన్నారట. ఏదేమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పలువురు అధికారుల పాలిట సంకటంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు.