నిమ్మగడ్డ కేసు : వెరీ ఇంపార్టెంట్ అప్ డేట్

June 02, 2020

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కేసు ఇన్నాళ్లకు ఒక కొలిక్కి వచ్చింది. అర్ధంతరంగా ఆర్డినెన్సులు ఇచ్చి రూల్స్ మార్చేసి వ్యూహాత్మకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసేలా చేసింది జగన్ సర్కారు. ఇందులో జగన్ సర్కారు చేసిన ఆరోపణలు, వేసిన అడుగులు, తీసుకున్న చర్యలే సాక్ష్యాలుగా వాడుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్లారు. 

తొలి మూడు సార్లు వీడియో కాన్ఫరెన్సులో సాగిన వాదనలు కోర్టు పాస్ వర్డ్ లీకై అందరికీ చేరడంతో నేరుగా కోర్టులోనే విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం. వరుసగా అందరి వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో తీర్పును రిజర్వు చేసింది. అంటే బాంబు ఎపుడైనా పేలొచ్చు. ఎవరిపై పేలుతుంది అన్నదే ఇక్కడ ఆసక్తికరం.

అయితే, కేసులో జరుగుతున్న పరిణామాలు జగన్ సర్కారు వ్యవహరించిన తీరు చూస్తే కచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్డినెన్సు రూపొందించిన విధానం కావచ్చు, మాజీకి, కొత్త కమిషనరుకు ఉన్న వయసు తేడా కావచ్చు, నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్న పదాలు కావచ్చు, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయం కావచ్చు.. ఇలా అన్ని కోణాల్లోను ప్రభుత్వం తమ వాదనల్లో వెనుకబడినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఎస్ఈసీ కనగరాజ్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్.ప్రసాద్ వాదనలు వినిపించారు. మాజీ న్యాయమూర్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం శుభపరిణామమని కోర్టును మురిపించే ప్రయత్నం చేశారు. కమిషనర్ పదవిని వయసుతో ముడిపెట్టడం సరికాదని వారు వాదించడం కొసమెరుపు. అంటే ప్రభుత్వం తనంతట తానే పాజిటివ్ అంశాలను, లాజిక్ లను కోర్టు ముందు ఉంచుతుంది.

ఇదిలా ఉండగా... ఎన్నికల కమిషన్ తరుఫున రాతపూర్వకంగా వాదనలు సమర్పించేందుకు మాజీ అడ్వకేట్ జనరల్ సీవీ మోహన్ రెడ్డి సమయం కోరగా సోమవారం వరకు హైకోర్టు సమయం ఇచ్చింది. అంటే... సోమవారం తర్వాత తీర్పు వెలువడనుంది.