ఇవాళ సాక్షి పేపరు చూశారా?

August 05, 2020

ఇటీవల వైఎస్ విజయమ్మ నాలో నాతో వైఎస్సార్ అంటూ ఒక పుస్తకం రాసిందట

దానిని జగన్ స్వయంగా తండ్రి గారి జయంతి రోజున విడుదల చేశారు.

అందులో ఓ పేజీలో ఇలా ఉంది

చెన్నారెడ్డిగారు CMగా ఉండగా #YSR ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండేవారని చెప్పారు. తప్పు జరిగితే ప్రతిపక్షమే ప్రశ్నించాలా? పార్టీలో ఉంటే ఎందుకు ప్రశ్నించకూడదని చెప్పేవారంట..!  

మరి అదే పని రఘురామరాజు చేయకూడదు. ఎందుకంటే... జగన్ కి నచ్చని పని చేయకూడదు

మరో పేజీలో ఇలా ఉంది.

ఒకసారి జగన్ అడిగారట. నాన్నా మన ప్రభుత్వం చేసే తప్పులు మన సాక్షిలో రాయొచ్చా? అని

అపుడు వైఎస్ రాజశేఖరరెడ్డి... రాసెయ్ బాబు, ప్రభుత్వం చేసే తప్పులు రాస్తేనే కదా వాటిని సమీక్షించుకుని ప్రజలకు న్యాయం చేసేది అని...

ఈరోజు మొదటి పేజీ ఓపెన్ చేయండి...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో దుర్మార్గంగా వ్యవహించారు అటూ సుప్రీంకోర్టు జగన్ సర్కారుకి చీవాట్లు పెట్టిన  వార్త మొదటి పేజీలో ఎక్కడుందో వెతకండి సరేనా... !!

కథ సమాప్తం !!