జగన్ ఐడియా బిగ్ నేషనల్ జోక్ అయ్యిందట

August 07, 2020

నిమ్మగడ్డ అంతు చూద్దామని జగన్ చేసిన ధైర్యం బూమ్ రాంగ్ అయ్యిందా? తాను  గెలవకపోగా పార్టీ ఆత్మస్థైర్యాన్ని, కేడర్ ను దెబ్బతీసిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు... వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజును రెబల్ ఎంపీ అంటారు గాని అతని మాట విని ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అతను ముందునుంచి తానే జగన్ కి ఉత్తమ అభిమాని అని చెప్పింది జోక్ కాదని, నిజమని తాజా ఘటనలు నిరూపించాయి.

ఈ కేసు తీర్పు అనంతరం రఘురామరాజు స్పందించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘‘రాజ్యాంగ వ్యవస్థలతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దేశమంతటా నవ్వులపాలయ్యిందని‘‘ రఘురామరాజు అన్నారు.  వ్యక్తిగతంగా చాలా మంది న్యాయనిపుణులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడాను... న్యాయవ్యవస్థలపై పోరాటం మంచిది కాదని, అసలు నిమ్మగడ్డపై పోరాటమే మంచి ఆలోచన కాదని చెప్పినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వమే న్యాయవ్యవస్థను ఇంత దారుణంగా కించపరిచే ప్రయత్నం చేయడం, ప్రభుత్వంలో పెద్ద పదవుల్లో ఉన్నవారు న్యాయవ్యస్థను దగ్గరుండి తిట్టించడం అందరం తలదించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చిందన్నారు. కొందరు జగన్ చుట్టూ చేరి చేసిన ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వానికి వేరే పనే లేనట్టు పోలీసులను అడ్డుపెట్టి నిమ్మగడ్డను అడ్డుకోమని చెప్పడం ఏంటి? ఆ పోలీసులను పక్కకు తప్పించండి. ఆయనకు కేంద్ర బలగాల రక్షణ ఉంది. నాకూ రేపో మాపో కేంద్ర బలగాలు వస్తాయి అన్నారు. ఎన్నికల్ని వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం ఎంత సరైందో ప్రజలకు స్వానుభవం అయ్యింది. పాతవన్నీ మరిచిపోయి ముందుకు వెళితే మంచిది అన్నారు రఘురామరాజు. తప్పులు తెలుసుకున్నవాడే నిజమైన మనిషి అని... ఇకనైనా రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థల్ని గౌరవం పెంచుకుంటూ భవిష్యత్తు బాగుంటుందని రఘురామరాజు హెచ్చరించారు. 

ఇసుక అక్రమాలు గాని, టీటీడీ భూముల అమ్మకం గాని, అమరావతి గాని, నిమ్మగడ్డ విషయంలో గాని రఘురామరాజు చేసిన సూచనలు అన్నీ పార్టీకి మేలు చేసేవే గాని నష్టం చేసేవి కాదు. ఇగోకు పోయి ఎదురుతిరుగుతావా నీ అంతు చూస్తా అనుకోవడం వల్ల వైసీపీ ఒక అనుభవజ్జుడిని కోల్పోయింది. ఇప్పటికీ రఘురామరాజు తనను తిట్టించిన జగన్ కి మంచి సలహాలే ఇస్తున్నారు. మెచ్యూర్డ్ గా ప్రవర్తిస్తున్నారు.