ఇది ఫైనల్... నిమ్మగడ్డే ఎన్నికల కమిషనర్ - 

August 15, 2020

ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గక పోతే... చాల ా పెద్ద నష్టాలను భరించాల్సి ఉంటుంది.

ఇపుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్  పరిస్థితి అదే.

రాజ్యాంగం అనేది ఒకటుంటుంది, దానికి లోబడి మాత్రమే మనం ప్రవర్తించాలన్న విషయాన్ని విస్మరించి చట్టాలు, నిర్ణయాలు చేయడంతో ఇష్టానుసారంగా ప్రవర్తించడంతో కోర్టుల్లో భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

నిమ్మగడ్డ విషయంలో ఎలాగైనా పైచేయి సాధించాలన్న తాపత్రయం వెనక్కు తన్నింది. 

తాజాగా జగన్ కు నచ్చని శుక్రవారం (పైగా ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం కూడాను) నిమ్మగడ్డను తిరిగి నియమించాల్సిందే అని తేల్చింది.

ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని పేర్కొంది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు అంటే హైకోర్టు తీర్పు అమలులో ఉన్నట్టే అని పేర్కొంది.

 ఏపీ ప్రభుత్వంపై తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

గతంలో తాము ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్ ను నియమించే అవకాశం గవర్నర్ కు ఉందని చెప్పామని పేర్కొంది. 

ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని మరోసారి ఆదేశించిన కోర్టు.. ఈలోపు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఏపీ గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని సూచించింది.

ఈ కేసు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తూ...  ఈ లోపు కౌంటర్ వేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీంతో నిమ్మగడ్డ బాధ జగన్ కి తప్పదని, ఆయనను నియమించని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు.