నిమ్మగడ్డ కేసులో మరో ట్విస్ట్ !

August 15, 2020
CTYPE html>
ఏపీ ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ (మాజీనో, కాదో చెప్పలేని పరిస్థితి) విషయంలో మరో ట్విస్టు ఇది. ఆయనను ఎన్నికల కమిషనర్ గా పునర్నియామకం చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు నిమ్మగడ్డ వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.... ఆయనకు తాజా షాకు తగిలింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ 2016 నియామకమే చెల్లనిది అంటూ గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామ వాసి శ్రీకాంత్ రెడ్డి కో వారంటో పిటిషను వేశారు. నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమిస్తూ గత ప్రభుత్వం 2016లో  జారీ చేసిన జీవో నెం.11 ను రద్దు చేయాలని పిటిషనరు కోరారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. అతను ఈ పిటిషను వేయడానికి కారణం హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వే కావడం గమనార్హం.
ఏపీ ఎస్ఈసీ నియామకం మంత్రి మండలి సిఫారసు మేరకు కాకుండా గవర్నరు విచక్షణ మేరకే జరగాలన్న తాజా తీర్పు నేపథ్యంలో నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదు అంటూ శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అందుకే నిమ్మగడ్డ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషను దాఖలు చేశారు. ఒకవేళ ఈ పిటిషనులో నిమ్మగడ్డకు వ్యతిరేకంగా తీర్పు వస్తే... అది కనగరాజ్ కి కూడా వ్యతిరేక తీర్పే అవుతుందన్నది ఇక్కడ మనం గమనించాలి. అంటే మూడో వ్యక్తి ఆ పదవిలోకి వస్తారు. చూద్దాం ఏపీలో నిమ్మగడ్డ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో.
 

ఏమిటి ఈ కో వారెంటో పిటిషను (Quo warranto) 

కోవారంటో అనేది ప్రాథమిక హక్కుల రక్షణ కొరకు జారీచేయబడిన 5 రిట్లలో ఒకటి. కో వారంటో అనగా... ‘‘ఏ అ ధికారంతో’’ అని అర్థం. ఒక ప్రభుత్వ పదవిని పొందుటకు ఒక వ్యక్తికి హక్కు లేదని కోర్టు భావించినప్పుడు అతనిని ఆ పదవి నుండి తొలగించుటకు కోర్టుకు హక్కు ఉంటుంది. ఈ హక్కును కో వారంటో అంటారు. ఈ రిట్‌ ప్రధాన ఉద్దేశం ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం.