నిమ్మగడ్డ కేసు - ట్విస్ట్ ఇచ్చిన రిటైర్డ్ ఐజీ

August 14, 2020

వ్యవస్థల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. న్యాయవ్యవస్థ నోటి నుంచి ఒక మాట వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.

కానీ.. అందుకు భిన్నంగా ఫైట్ చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ప్రభుత్వంలో మొన్నటివరకూ బాధ్యుడిగా వ్యవహరిస్తూ. . రిటైర్ అయ్యాక మాట్లాడే తీరు వేలెత్తి చూపించేలా ఉండకూడదు.

అందుకు భిన్నంగా ఏపీకి చెందిన రిటైర్డు ఐటీ సుందర్ కుమార్ దాస్ చేసిన తాజా వినతి విస్మయానికి గురి చేస్తోంది.

ఓవైపు ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డను ప్రభుత్వం నియమించాలని చెబుతూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం.. అది కాస్తా అమలు కాకపోవటం తెలిసిందే.

తాజాగా ఇదే అంశంపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ ఉదంతం సంచలనంగా మారింది.

తాము ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయాలని గవర్నర్ ను కోరాలంటూ నిమ్మగడ్డకు సలహా ఇచ్చింది.

ఇలాంటివేళ.. అనూహ్యంగా రిటైర్డు ఐపీఎస్ అధికారి ఒకరు తెర మీదకు రావటం.. హైకోర్టు మాటల్ని తప్పు పట్టేలా ఆయన వ్యాఖ్య చేయటం సంచలనంగా మారింది.

నిమ్మగడ్డను కొనసాగించొద్దని గవర్నర్ కు తాను లేఖ రాయనున్నట్లుగా ప్రకటించారు రిటైర్డు ఐజీ డాక్టర్ ఆలూరి సుందర్ కమార్ దాస్ కోరారు.

దీనికి సంబంధించి ఈ మొయిల్ గవర్నర్ కు పంపారు.

సాధారణంగా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. మళ్లీ ఆ అంశాన్ని కెలికేందుకు ఎవరూ ఇష్టపడరు. అందుకు భిన్నంగా వ్యవహరించిన రిటైర్డుఐజీ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇంతకూ ఆయన లేవనెత్తే పాయింట్లు ఏమంటే.. నిమ్మగడ్డ నియామకం రాజ్యాంగంలోని అధికారణ 243(కె( ప్రకారం జరగలేదని.. హైకోర్టుతీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీ కాలం.. సర్వీసు నిబంధనల్ని రూపొందించే అధికారం మాత్రమేసర్కారుకు ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏమైనా.. కోర్టులో ఉన్న వివాదానికి సంబంధించి వినిపిస్తున్న వాదనలు కొత్త చర్చకు తెర తీసినట్లే. ఓవైపు కోర్టు ఆదేశాలతో అభ్యంతరం ఉంటే.. గవర్నర్ కు ప్రశ్నాస్త్రాలు గవర్నర్ కు పంపే కన్నా.. న్యాయస్థానం ముందుకే వెళితే సరిపోతుంది కదా? ఆ పని చేయకుండా మీడియాకు.. గవర్నర్ కు మొయిల్ పంపటంలో మర్మం ఏమిటి? అన్నదిప్పుడు అసలు ప్రశ్న.