నిమ్మగడ్డ... మామూలోడు కాదే !

June 05, 2020

ఏపీ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గతంలో భద్రత పెంచమని కేంద్రానికి లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే. అది స్వయంగా నిమ్మగడ్డ రాసినట్టు అప్పట్లో ఆయన ధృవీకరించకపోవడంతో దాని చుట్టూ చాలా వివాదం నడిచింది. జగన్ అనుకూల మీడియాలు అది ఫేక్ మీడియా అని బహిరంగంగా ప్రసారం చేశాయి. ఇతర మీడియాలు మాత్రం లేఖ రాశారు... కానీ నిమ్మగడ్డ ధృవీకరించలేదు అంటూ పేర్కొన్నాయి. అయితే... లేఖలో మాటలు మాత్రం అక్షర సత్యాలు అనే మాట అందరూ ఒప్పుకున్నారు.

తాజాగా.. సదరు లేఖను రాసింది తానేనని.. ఓపెన్ అయ్యారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. కేంద్ర హోం శాఖకు గతంలో తానే లేఖ రాసినట్లుగా పేర్కొన్నారు. తాజాగా ఆయన విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. అందులో ఏముందంటే.. 

‘‘ఆ లేఖను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నేనే రాశా. నాకున్న అధికార పరిధిలో లేఖ రాశా. దానిపై ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా నిర్దారించారు. దానిపై ఎలాంటి ఆందోళన.. సందేహాలు అవసరం లేదు. ఎలాంటి వివాదాలకు రాద్దాంతాలకు తావు లేదు’’ అని తేల్చారు. 

తన లేఖపై ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం ఏంటి అని విజయసాయిరెడ్డిపై పరోక్షంగా చురకలు వేశారు నిమ్మగడ్డ. మీరు ఇష్టారాజ్యంగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తారు. కానీ ప్రభుత్వం ద్వారా సంక్రమించిన విచక్షణను వాడితే మాత్రం మీకు తప్పకు అనిపించిందా అన్నట్టు ఘాటు రిప్లై ఇచ్చారు. ప్రజల మంచి కోసం చేసినా తప్పు పట్టడం ఏంటని నిలదీశారు.

నిమ్మగడ్డ వ్యవహారం చూస్తుంటే ఒక విషయం అర్థమవతుంది. అతను మొండిఘటం. మొహం మీద ఉన్నది ఉన్నట్లు చెప్పే రకం. ఎవరికీ జంకే రకం కూడా కాదు అని స్పస్టంగా అర్థమవుతోంది. జగన్ కు అందరూ తమంతట తాము సరెండర్ అవుతుంటే నిమ్మగడ్డ మాత్రం.. రూల్స్ ప్రకారం నడుచుకుంటూ జగన్ కి నిద్ర లేకుండా చేస్తున్నాడు. జగనే మొండి అయితే... నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగమొండి అంటున్నారు జనం.