10వ తేదీ వస్తోంది... ఏపీ సర్కారులో భయం

August 08, 2020

దేశమంతటా అన్ని రాష్ట్రాలకు క.రోనా భయం ఉంటే ఏపీ సర్కారుకు మాత్రం ఇసుక భయం, సుధాకర్ భయం, నిమ్మగడ్డ భయం... ఇలా ఉంటున్నాయి. ప్రభుత్వం అనవసర విషయాలపై తలదూర్చి కొత్త సమస్యలను తెచ్చుకుంటోంది. దీనివల్ల పాలన గాడి తప్పుతోంది. రంగులపై హైకోర్టుకు సుప్రీంకోర్టకు షటిల్ సర్వీసులా తిరిగిన ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు చివరకు చీవాట్లు పెట్టి నాలుగు వారాల డెడ్ లైన్తో వార్నింగ్ ఇచ్చింది. దీంతో అనవసరంగా పైకోర్టుకు పోయామని ప్రభుత్వ పెద్దలు రిగ్రెట్ ఫీలయ్యారు.

ఆ ఘటన తర్వాాత నిమ్మగడ్డ ప్రసాద్ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసు 10వ తేదీ విచారణకు రానుంది. ఈ కేసును ఏకంగా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బోబ్డేతో కూడిన ధర్మాసనం విచారిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు వస్తాయో అన్న భయంతో సర్కారు వణికిపోతుంది. ఇందులో నిమ్మగడ్డ ఓడిపోతే ఆయనకు ప్రత్యేకంగా పోయేదేమీ లేదు. కానీ సర్కారు ఓడిపోతే ఇకపై ఏదైనా కేసు సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. అందుకే ఏపీ అధికార పార్టీలో నిమ్మగడ్డ కేసు విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రంగుల కేసు పోవడం వల్ల ఈ ఉత్కంఠ ఏర్పడింది.

ఇందులో నిమ్మగడ్డ ఒకట్రెండు మిస్టేక్స్ ఉన్నా... అవి వేరే కేసు అవుతాయి గాని... రాజ్యాంగ ఉల్లంఘన కేసు కాదు. కానీ ఏపీ సర్కారుపై కేసు మాత్రం రాజ్యాంగ ఉల్లంఘన కేసు కానుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఇది ఇతర అనేక పరిణామాలకు దారితీస్తుంది.