​నిమ్మగడ్డ కేసులో పెరుగుతున్న ఉత్కంఠ

August 05, 2020
CTYPE html>
ఏపీలో ఇపుడు నిమ్మగడ్డ రమేష్ ఎంత హాట్ టాపిక్కో అందరికీ తెలిసిందే. నిన్నటి నుంచి ఆ కేసులో ఏం తీర్పు వస్తుందా అని కరోనా ఒత్తిడిలో ను జనం దాని గురించే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు పాలకులు, ఇటు ప్రతిపక్షాలు దీనిపై ఉత్కంఠగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సుదీర్ఘ విచారణ అనంతరం... నేటికి విచారణ వాయిదాపడింది.
ఈరోజు కూడా కేసులో వాదనలు జరిగాయి. నిన్న ఈరోజు విచారణ వీడియో కాన్ఫరెన్సులో జరిగింది. అయితే సడెన్ గా ఈరోజు విచారణ లోకి అనుమతి లేని న్యాయవాదులు ఎంటరయ్యారు. ఇతరులు కూడా ఎంటరయ్యారు. మొత్తం 40 మంది వీడియో కాన్ఫరెన్సులోకి వాడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వీరందరికీ అనుమతి ఇవ్వలేదు. వీళ్లంతా ఎలా రాగలిగారు అంటూ ప్రధాన న్యాయమూర్తి అభ్యంతరం చెప్పారు. చివరకు పాస్ వర్డ్ లీక్ చేశారని అర్థమై... విచారణను ఆపేసి సోమవారానికి వాయిదా వేశారు. అయితే సోమవారం దీనిపై నేరుగా విచారణ జరుపుతామని సీజే వెల్లడించారు. ఈ సందర్భంగా విచారణకు హాజరయ్యే వ్యక్తులకు పాసులు జారీ చేసేలా డీజీపీకి లేఖ రాస్తామని సీజే వెల్లడించారు.
ఈరోజు తీర్పు వెలువడుతుంది అనుకుంటున్న నేపథ్యంలో సడెన్ గా వాయిదా పడటం అటు ప్రభుత్వానికి, ఇటు నిమ్మగడ్డకు, ప్రతిపక్షాలకు ఉత్కంఠను పెంచింది. ఎన్నికల విషయంలో చాలా ఆతృతగా ఉన్న జగన్ దానిపై ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకుంటున్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎస్ ఈ సీని తెలివిగా తప్పించేశారు. అయితే ఇధి ఇంకా అయిపోనట్లు కాదు గాని... జగన్ ఆసక్తి మాత్రం కరోనా మీద కంటే ఎన్నికల మీదనే ఎక్కువగా ఉన్నట్లు అందరికీ అర్థమైపోయింది.