నిమ్మగడ్డ కేసు... హైకోర్టు ఏమందంటే...

June 05, 2020

వారం రోజుల క్రితమే తేలాల్సిన నిమ్మగడ్డ తొలగింపు పిటిషన్ విచారణ ఇంకా సాగుతూనే ఉంది. ఈ రోజు తుదితీర్పు వస్తుందని అందరూ భావించారు. కానీ రేపటికి విచారణ వాయిదా పడింది. ఈరోజే నేరుగా కోర్టులో విచారణ కొనసాగింది. ఈ కేసులో సుమారు 5 గంటల పాటు వాదోపవాదాలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరితో పాటు ఇంకొందరు న్యాయమూర్తిలు వాదనలు విన్నారు. 

పిటిషనర్ నిమ్మగడ్డ తరఫు న్యాయవాదులు...ఆదినారాయణ, నారాయణ వాదనలు వినిపించారు. రాజ్యాంగం ప్రకారం ఏపీలో ఎన్నికల కమిషనర్ ఇలా మధ్యలో తొలగించే అవకాశం లేదంటూ వారు తమ వాదనను వినిపించారు. ప్రభుత్వ చర్య పూర్తి అసంబద్ధం అన్నారు. ప్రభుత్వ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్రానికి ఉన్న అధికారాల పరిధిలోనే అంతా ఓకే చేశామని, గవర్నర్ ఆమోదించారని నిమ్మగడ్డను తొలగించలేదని వాదించారు. కాలపరిధి ముగియడంతో ఆయన పదవి కోల్పోయారన్నారు.  అయితే... మరికొన్ని పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి వారి వాదనలు కూడా విన్న అనంతరం తీర్పు నిర్ణయిస్తామని, అందుకోసం విచారణ రేపటికి వాయిదా వేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. మొత్తానికి నిమ్మగడ్డ కేసులో ఉత్కంఠ ఇంకా వీడలేదు. 

హుటాహుటిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం... ఆకస్మికంగా తమిళనాడుకు చెందిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. జీవో జారీ అయిన గంటలోగానే కనగరాజ్ బాధ్యతలు స్వీకరించడం ప్రభుత్వాన్ని ఇపుడు ఇరుకున పెట్టనుంది. ఆ వెంటనే ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డను తప్పించడంపైన పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదంతా కావాలని చేసిందనడానికి అన్ని ఆధారాలున్నాయి. పైగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిమ్మగడ్డను తప్పించిందని, ఆ ఆర్డినెన్స్ చెల్లదంటూ 11 పిటిషన్లు హైకోర్టులో దాఖలవడ సంచలనం రేపింది. ఇ కేసులో నిమ్మగడ్డతో పాటుగా కొత్త కమిషనర్ ఇంప్లీడ్ అయ్యారు. ఆయన తమ వాదనలను కోర్టు ముందు నివేదించారు.  విచారణ సమయంలో కోర్టు చేసిన కామెంట్స్ ప్రభుత్వ వాదనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పిటిషనర్ తరపున న్యాయవాదులు చెబుతున్నారు.