గవర్నరును కలిసిన నిమ్మ గడ్డ... ఆయన ఏమన్నారంటే

August 09, 2020

నిమ్మగడ్డ వ్యవహారంలో రోజురోజుకు ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మొన్న శుక్రవారం హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఏపీ ఎస్ ఈ సీ గా నియమించలేదు అంటూ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. అంతేకాదు, నిమ్మగడ్డను గవర్నరును కలవమని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రమేష్ కుమార్ గవర్నరును కలిశారు.

తనను ఎస్‌ఈసీగా నియమించాలని కోరడానికి గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకుని నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు.  తనను ఎస్ఈసీగా నియమించే అధికారం గవర్నరుకు ఉందంటూ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ... కోర్టు ఆదేశాల మేరకు ఆయనను కలిసినట్టు చెప్పారు. తనను తిరిగి నియమించాలని వినతి పత్రం ఇచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నరు తన వినతి పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. హైకోర్గు తీర్పు ప్రకారం తనను తిరిగి నియమించే అధికారం గవర్నరుకు ఉందని హైకోర్టు చెప్పిన విషయాన్ని నిమ్మగడ్డ  వెల్లడించారు.

కేవలం కరోనా నియంత్రణకు ఎన్నికలను వాయిదా వేసినందుకు వ్యవహారం ఇక్కడి దాకా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోర్టు ధిక్కరణ పిటిషనుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.