రాష్ట్ర ఎన్నికల కమిషనర్‍గా నిమ్మగడ్డ రమేశ్‍కుమార్‍

August 05, 2020

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‍గా నిమ్మగడ్డ రమేశ్‍కుమార్‍ను తిరిగి నియమించాలని గవర్నర్ ఆదేశం - ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపిన గవర్నర్ బిశ్వభూషణ్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్‍ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‍కుమార్‍ను నియమించాలని ఆదేశం - హైకోర్టు తీర్పు, ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఆదేశం 

సాక్షి మినహా మిగిలిన అన్ని ఛానళ్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‍గా నిమ్మగడ్డ రమేశ్‍కుమార్‍ను తిరిగి నియమించాలని గవర్నర్ ఆదేశించిన వార్తను ప్రసారం చేస్తున్నాయి

నిమ్మగడ్డను ఎస్‍ఈసీగా నియమించాలని గవర్నర్ ఆదేశించడం ప్రజాస్వామ్య విజయం - న్యాయవ్యవస్థ పాత్రను ఎవరైనా శిరసావహించక తప్పదని.. ఉత్తర్వుల ద్వారా సందేశమిచ్చిన గవర్నర్‍కి అభినందనలు:మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఎస్‍ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలని.. గవర్నర్ ఆదేశాలు ఇవ్వడం హర్షణీయం - సీఎం జగన్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి - రాజ్యాంగబద్ద వ్యవస్థలను విధ్వంసం చేయడం మానుకోవాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

RELATED ARTICLES

  • No related artciles found