లండన్‌లో నీరవ్‌ మోడీ అరెస్ట్‌

June 01, 2020

పాపం పండింది. నేరం చేసిన టెంపరరీగా తప్పించుకోవచ్చు కానీ జీవితాంతం తప్పించుకుంటూ తిరగలేమని నీరవ్‌ మోడీకి అర్థమైంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ని రూ.13 వేల కోట్లకు మోసం లండన్‌ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీని లండన్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోనికి దిగిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి వెస్ట్మినిస్టర్ కోర్టులో హాజరు పరిచారు. భారత ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్, సీబీఐ అధికారుల పిర్యాదు మేరకు గతంలోనే వెస్ట్ మినిస్టర్ కోర్టు వారెంట్ జారీ చేసింది. అయితే అతను ఎక్కడ ఉన్నాడనే అనే విషయం ఇన్నాళ్లు ఎవ్వరికీ తెలియలేదు. అయితే రెండు వారాల క్రితం ది టెలిగ్రాఫ్ పత్రిక రిపోర్టర్ కంటపడ్డాడు నీరవ్ మోడీ. ఆ వీడియో కాస్తా వైరల్‌ అవ్వడంతో... ఇవాళ లండన్ పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు.
నీరవ్‌ మోడీ అరెస్ట్ తో మన పోలీసులకు మంచి విజయ లభించినట్లు అయ్యింది. ఇక లిస్ట్ లో మరో ఇద్దరు వ్యాపారులు కూడా ఉన్నారు. వారే మోహుల్‌ చోక్సీ మరియు విజయ్‌ మాల్యా. విజయ్‌ మాల్యా తన అప్పుల్ని కడతాను అని చెప్తున్నాడు కానీ ఇండియాకు మాత్రం తిరిగి వచ్చే ఆలోచన లేదని చెప్తున్నాడు. ఇక నీరవ్ మోడీ మామ మోహుల్ చోక్సీ కూడా బ్యాంకులను మోసం చేసి పారిపోయాడు. ప్రస్తుతం ఆంటిగ్వా దేశ పౌరసత్వం తీసుకొని అక్కడే ఉంటున్నాడు. అతనిని కూడా అరెస్ట్ చేసి దేశానికి రప్పించడానికి భారత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.