దొర దెబ్బకు మెట్రో ఎక్కిన నితిన్

August 08, 2020

హైదరాబాదును హైదరాబాదుగా ఉండనియ్యి స్వామీ అంటే పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తా, కూకట్ పల్లిని అమెరికా చేస్తా అని ప్రగల్బాలు పలికిన మన సీఎం సారు రెండోసారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటికే హైదరాబాదులో ఏ మార్పూ లేదు. వాన కష్టాలు అపుడూ ఇపుడూ సేమ్ టు సేమ్. వర్షం వస్తే వామ్మో హైదరాబాదు అనాల్సిన పరిస్థితి.
దొర దెబ్బ మన తెలంగాణ మెగాస్టార్ నితిన్ కు కూడా తగిలింది. హైదరాబాదు పోరడు కదా... చిన్నవానకే జలమయమయ్యే రోడ్లతో బాలా అర్థమై... కారు కంటే మెట్రో బెటర్ అని ఫిక్సయ్యాడు. ప్యాకప్ అయిన వెంటనే మెట్రో ఎక్కేసి ఇంటిదారి పడ్డాడు.
అతన్ని చూడగానే సాటి ప్రయాణికులు వావ్ నితిన్... నువ్వు మెట్రో ఎక్కావా అంటూ సంబరపడ్డారు. ప్రయాణికులు సర్ ప్రైజ్ ఫీలయ్యారు. నితిన్... తన ఓ సెల్ఫీ దిగి మెట్రో ప్రయాణం గురించి ఇన్ స్టాలో రాసుకున్నాడు. ‘‘రోడ్లపై భారీ ట్రాఫిక్ ఉంది. ప్యాకప్ అయ్యాక... ఇక మెట్రో ఎక్కేశా. ఈ అనుభవం చాలా బాగుంది‘’ అంటూ చెప్పుకొచ్చారు. దొరనా మజాకా... నితిన్ ను ఏంటి... అమెరికా ప్రెసెడెంట్ ను కూడా వానొస్తే మెట్రో ఎక్కిస్తాడు.