నిత్యానంద‌కు సొంత దేశం.. అత‌నే ప్ర‌ధాని

August 03, 2020

వివాదాస్ప‌ద స్వామీజీ నిత్యానంద మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చాడు. అత‌ను ఒక దేశానికి అధిప‌తి అయ్యాడు. సొంతంగా ఒక దేశాన్ని కొనుక్కుని.. త‌న‌ను తాను దానికి ప్ర‌ధానిగా ప్ర‌క‌టించుకున్నాడు. ఆ రాజ్యానికి కైలాస అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఈ కాలంలో సొంతంగా దేశం కొనుక్కోవ‌డ‌మేంటి.. దానికి అధిప‌తిగా ప్ర‌క‌టించుకోవ‌డం ఏంటి అనిపిస్తోందా? ఐతే ఇది నిజం. ద‌క్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ దేశం నుంచి నిత్యానంద ఒక ప్రాంతాన్ని కొనుగోలు చేశాడు. దానికి కైలాస అని పేరు పెట్టాడు. అది హిందూ రాజ్య‌మ‌ట‌. దానికి నిత్యానంద ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ట‌.
ప్ర‌జ‌లు ఎవ‌రైనా త‌న రాజ్యంలో చేరొచ్చ‌ని.. అందుకు ఉన్న ష‌ర‌తుల్ని పాటించాల‌ని.. పౌర‌స‌త్వం కోసం విధి విధినాల్ని అనుస‌రించాల‌ని నిత్యానంద అంటున్నాడు. ట్రినిడాడ్ అండ్ టుబాగోకు ద‌గ్గ‌ర‌గా ఉండే ఈ ప్రాంతం ఒక దీవి అని తెలుస్తోంది. ఈ ప్రాంతం కైలాసం అయితే తాను ప‌ర‌మ‌శివుడిని అనేది నిత్యానంద ఉద్దేశం. దీన్ని హిందూ స్వ‌తంత్ర దేశంగా నిత్యానంద పేర్కొంటున్నాడు. త్వ‌ర‌లోనే క్యాబినెట్ ఏర్పాటు చేసి మంత్రుల్ని కూడా ప్ర‌క‌టిస్తాన‌ని నిత్యానంద చెబుతుండ‌టం విశేషం. ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. త‌ర‌చుగా త‌న పిచ్చి ప్ర‌సంగాల‌తో వార్త‌ల్లో నిలిచే నిత్యానంద తాజా ప‌రిణామంతో మ‌రింత‌ చ‌ర్చ‌నీయాంశంగా మారాడు.