కర్నూలు, గుంటూరు... హాహా కారాలే !!

June 02, 2020

ఏపీలో కోవిడ్ 19 విశ్వరూపం చూపిస్తోంది. కరోనా వ్యాప్తి అంతుచిక్కని విధంగా ఉంది. మారుమూల గ్రామాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు అనంతపురంలో వచ్చిన కేసు ఎక్కడో మారుమూలలో ఉంది. అతనికెలా వచ్చిందని ఆరాతీస్తే ఇటీవలే కరోనాతో మృతిచెందిన వ్యక్తి చేరిన ఆస్పత్రిలో ఇతను చికిత్స తీసుకున్నాడట. ఇపుడు ఆ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న వారింరదని ట్రేస్ చేసే పనిలో ఉంది సర్కారు. ఇంకొన్నిచోట్ల కరెన్సీతో వ్యాప్తి చెందిన అనుమానాలను కూడా పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. ఇక తాజాగా ఈరోజు 38 కేసులు ఇప్పటివరకు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో బయటపడ్డాయి.

ఏపీలో కరోనాకు తీవ్రంగా ప్రభావితం అవుతున్న జిల్లాలు గుంటూరు, కర్నూలు. ఇక్కడ ఒక్కో జిల్లాలో 126 కేసులు నమోదయ్యాయి. వీరిలో గుంటూరులో నలుగురు, కర్నూల్లో ఇద్దరు మృతిచెందారు. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో ఈ రెండూ కూడా ఉన్నాయి. వీటిలో అధిక కేసులు మర్కజ్ నిజాముద్దీన్ వి అనే తేలింది. ఇంత భారీ ఎత్తున కేసులు బయటపడుతుండటంతో ఈ రెండు జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. బయటకు అడుగుపెట్టడానికే భయపడుతున్నారు. ఈ వ్యాప్తి ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ రెండింటి తర్వాత అధికంగా ప్రభావితం అయిన జిల్లా నెల్లూరు జిల్లా. ఇక్కడ 64 కేసులు నమోదయ్యాయి. 

ఒకవైపు ఏపీలో కోవిడ్ వ్యాప్తి ఇంత వేగంగా ఉంటే... ముఖ్యమంత్రి జగన్, ఆయన బృందం ఇతరత్రా విషయాలపై దృష్టిపెడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెయ్యి కళ్లతో కోవిడ్ అదుపు చేయాల్సి ఉండగా... ఆర్డినెన్సులు, నియామకాలు అంటూ జగన్ రాజకీయాలు చేస్తున్నారు. ఆయన అనుచరులు కూడా రాబోయే ఎన్నికలపై తప్ప కరోనా అరికట్టడంపై దృష్టిపెట్టడం లేదు.