అమరావతి గురించి ఒక సూపర్ న్యూస్ !

July 12, 2020

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన స్వల్పకాలంలోనే అమరావతిలో అన్ని పనులు ఆపాలని ఆదేశాలు రావడంతో రెండు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. తాము రైతులు భూములు తిరిగి ఇస్తామని వైసీపీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. మంత్రులు కూడా అమరావతి గురించి అదేపనిగా నెగెటివ్ ప్రచారం చేస్తూ లీకులు ఇచ్చింది. చివరకు అమరావతి గురించి వారికి జ్జానోదయం అయ్యింది. రాజధాని అమరావతి కావడం వల్ల గుంటూరు జిల్లా రూపు రేఖలు చాలా మారిపోయాయి. సంపద పెరిగింది. రైతులు ఇక్కడి భూములు కోల్పోయినా ఇతర పలుచోట్ల కొని బాగా లాభపడ్డారు. ఇపుడు ఇక్కడ కూడా నగరం ఏర్పాటైతే తమకు వచ్చే ఆ కొంచెం చాలు... పాత భూమి కంటే విలువైనదిగా ఉంటుందనే ఆలోచనతో ఉన్నారు. అందుకే జగన్ భూములు తిరిగిస్తామంటే ఏ ఒక్కరూ ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే... భూములు తీసుకోవడం వారికి ఇష్టమే అయినా... భూములన్నీ తీసుకుంటే ఇక్కడ రాజధాని కట్టరు, రాజధాని కట్టకపోతే భూములు తిరిగి వచ్చినా ఉపయోగం లేదు. అందుకే పెద్ద సంఖ్యలో వైసీపీకి మద్దతుగా నిలిచిన గుంటూరు ప్రజలు అమరావతి మార్పును వ్యతిరేకిస్తున్నారు. దీంతో జగన్ వెనుకడుగు వేయడానికి ఇది మొదటి కారణమైంది. 

ఇక రాజధాని మార్పు గురించి ఎందుకు జగన్ అంత నెగెటివ్ గా ప్రచారం చేయించారంటే దానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా అమరావతి భూములపై తన పార్టీ వారి ఆధిపత్యం తెచ్చుకోవడానికి వేసిన వ్యూహంలో అదొక భాగం. ఇక పోతే అమరావతి నుంచి రాజధాని మారిస్తే ఎక్కడ పెట్టాలన్న దానిపై మరో వివాదం తలెత్తుతుంది. ఇది పలురకాలుగా జగన్ కు నష్టం చేస్తుంది. కేంద్రం సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో మళ్లీ అక్కడ ఏవైనా భవనాలు కట్టాలంటే ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎటువంటి ప్రయోగాలు పోకుండా జాగ్రత్తగా ముందుకు పోవాలని జగన్ నిర్ణయించారు.

అందులో భాగంగా రాజధాని అమరావతిగా కొనసాగించాలన్నది ప్రధాన నిర్ణయం. అయితే, ఆర్భాటపు బిల్డింగులు ఏమీ ఉండవు. హైదరాబాదు లాగా ప్రైవేటు వ్యక్తుల చేతే రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేయిస్తారు. పాత మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసి ... దాని పరిధి తగ్గించి కడతారు. ఎన్ని విమర్శలు చేసినా... చివరకు రాజధానిని మాత్రం అమరావతి నుంచి తరలించకపోవడంతో ఇపుడు రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు ఊపిరిపీల్చుకుంటున్నారు.