షాకింగ్: బీఎస్-6 టూవీలర్ లో ఆ సౌకర్యాలన్ని మిస్..

August 07, 2020

మీరు టూవీలర్ వాడుతున్నారా? టూవీలర్ నడపాల్సిన అవసరం మీకుందా? టూవీలర్ వాడే ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన కీలకమైన అప్డేట్ ఇది. దేశ వ్యాప్తంగా కాలుష్య నియంత్రణ కోసం భారత్ స్టేజ్ - 6 పేరుతో శుద్ధి చేసిన చమురు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లోని వాహనదారులకు అందుబాటులోకి తేనున్నారు. దీనికి తగ్గట్లే.. వాహనాల్ని మార్చేశారు. ఇప్పుడు కొనుగోలు చేయాల్సిన వాహనాలన్ని బీఎస్-6 ప్రమాణాలకు తగ్గట్లు రూపొందించినవే అయి ఉండాలి. లేకపోతే మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు.
ఇప్పటివరకూ ఉన్న బీఎస్-4 వాహనాల నుంచి భారీ ఎత్తున కాలుష్యం వెలువడుతున్న నేపథ్యంలో కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఇప్పటివరకూ వాడే ఇంధనంలో సల్ఫర్ 50 శాతం వరకు ఉండే స్థానే దాన్ని పది శాతానికి పరిమితం చేస్తున్నారు. దీనికి తగ్గట్టే వాహన డిజైన్ లోనూ మార్పులు చేశారు. ఇంతకాలం టూ వీలర్ వాడే వారు.. వాహనంలో పెట్రోల్ ఆఖరి బొట్టు వరకూ వాడటమే కాదు.. ట్యాంక్ మొత్తం ఖాళీ అయిన తర్వాత కూడా బండిని వంచి స్టార్ట్ చేస్తే కనీసం అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకూ ప్రయాణించే వీలుండేది.
కొత్త మోడళ్లలో ఆ సౌకర్యం లేదు. అంతేనా.. కనీసం లీటర్ పెట్రోల్ లేకుంటే.. బండి ముందుకు కదలదని వాహనరంగ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇంజిన్ ఆన్ కాకుండా మొరాయిస్తే.. చౌక్ (అదేనండి ప్లగ్) లాగి ట్రై చేస్తే.. పెద్ద ఎత్తున పొగ వచ్చి బండి స్టార్ట్ అవుతుంది కదా. కొత్తగా తెస్తున్న మోడళ్లలో ఆ ఫీచర్ ను తీసేస్తున్నారు. సో.. టూవీలర్ వాడేటోళ్లు కొత్తగా అప్డేట్ చేసుకోవాల్సిన రెండు అంశాల్లో ఒకటి మీ ట్యాంక్ లో లీటరు పెట్రోల్ మినిమం ఉంటే తప్పించి బండి స్టార్ట్ కాదు. చౌక్ కూడా ఉండదు. ఈ కొత్త ఇబ్బందుల్లో సానుకూలాంశం ఏమంటే.. మైలేజీ 10 నుంచి 12 శాతం అదనంగా వస్తుంది. కొత్త సౌకర్యంతో పాటు.. కొన్ని ఇబ్బందులు తప్పవనటానికి ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు.