హడలెత్తిస్తున్న లోకేష్ చాంబర్ వెనుక కారణం?

September 17, 2019

ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ ఆ ఛాంబ‌ర్ కున్న ప‌వ‌ర్ అంతా ఇంతా కాదు. త‌ర‌చూ ఏదో రూపంలో ఆ ఛాంబ‌ర్ లో కూర్చున్న వ్య‌క్తి వార్త‌ల్లో నానుతూ ఉండేవారు. అధికారానికి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన అలాంటి ఛాంబ‌ర్ చేతికి వ‌స్తే.. ఎవ‌రైనా ఏమ‌నుకుంటారు? వెంట‌నే అందులోకి దిగిపోతారు. కానీ.. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఏపీ స‌చివాల‌యంలో ఉంది. చంద్ర‌బాబు కుమారుడు క‌మ్ మాజీ మంత్రి లోకేశ్ కు చెందిన ఛాంబ‌ర్ ను తీసుకోవ‌టానికి ఎవ‌రూ సుముఖ‌త చూప‌టం లేద‌ట‌.
తాజాగా రాష్ట్ర గ‌నులు.. పంచాయితీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి లోకేశ్ వాడిన ఛాంబ‌ర్ ను కేటాయించారు. అయితే.. స‌ద‌రు ఛాంబ‌ర్ లోకేశ్ వాడిన‌ద‌న్న విష‌యం తెలిసినంత‌నే.. ఆ ఛాంబ‌ర్ త‌న‌కు వ‌ద్దంటే వ‌ద్ద‌నేసిన ఆయ‌న‌.. త‌న‌కు వేరే ఛాంబ‌ర్ ను కేటాయించాల‌ని కోరారట‌. తాను ఆ ఛాంబ‌ర్ నుంచైతే ప‌ని కూడా చేయ‌న‌ని చెప్పార‌ట‌. దీంతో.. ఆఘ‌మేఘాల మీద ఆయ‌న‌కు వేరే ఛాంబ‌ర్ ను కేటాయించిన‌ట్లుగా తెలుస్తోంది.
నారా లోకేశ్ గతంలో ఐదో బ్లాక్ లోని ఛాంబ‌ర్ ను కేటాయించారు. ఇదే ఛాంబ‌ర్ ను పెద్దిరెడ్డికి ఇవ్వ‌టం.. ఆయ‌న రిజెక్ట్ చేయ‌టంతో ఇప్పుడాయ‌న‌కు మ‌రో ఛాంబ‌ర్ నుకేటాయించారు. చిన‌బాబు ఛాంబ‌ర్ ను తీసుకోవ‌టానికి ఎవ‌రూ పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌టం లేదంటున్నారు. ఎమ్మెల్సీగా ఎంపికై.. అనంత‌రం మంత్రి అయిన లోకేశ్‌.. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా ఓడిపోవ‌టం తెలిసిందే. అయితే... ఆ గదికి వాస్తులోపాలే కారణ అని తెలుస్తోంది. దానివల్లే వారు భయపడుతున్నారని తెలుస్తోంది. వాస్తు మార్పు లోకేష్ గుర్తించారో లేదో తెలియదు గాని ఆ గదికి వెళ్తే పతనమే అంటున్నారట.