జాతీయ మీడియాలో జగన్ అరాచకాలపై చర్చ

June 01, 2020

ఒక డాక్టరును ఏపీ పోలీసులు ట్రీట్ చేసిన విధానంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంత జరిగితే మానవ హక్కుల మేధావులు, సంఘాలు, డాక్టర్ల సంఘాలు, ఐఎంఏ ఇలా ఎవరూ స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని... ముంబై జర్నలిస్ట్ విద్యా ముంబై మిర్రర్ పత్రికలో ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ ఒక కథనం రాశారు.

ఇక జాతీయ మీడియా ఈ సంఘటనను తీవ్ర దిగ్బ్రాంతికరమైనది గా పేర్కొంది. తెలుగు నాట రాజకీయ పార్టీలు దీనిపై నోరు మూసుకుని ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీపీఐ, సీపీఎం పార్టీలు తప్ప... బీజేపీ, జనసేన దీనిపై సైలెంట్గా ఉండటం విచిత్రం. 

డాక్టరు టీడీపీ వాడని వైసీపీ తెలివిగా వేసిన ముద్రకు భయపడి ఈ పార్టీలు స్పందించడానికి భయపడుతున్నారు. వాస్తవానికి నిన్నపోలీసులు వ్యవహరించిన తీరు ఏ వ్యక్తి పట్ల చేసినా తప్పే. ఆ డాక్టరు స్థానంలో ఒక టీడీపీ కార్యకర్త ఉన్నా కూడా అది అన్ని పార్టీలు ఖండించదగిన ఇన్సిడెంటే. కానీ ఎందుకో ఏపీలో విచిత్రమైన రాజకీయం నడుస్తుంది. 

ప్రతిదానికీ కులం, పార్టీ అంటగడుతున్నారు. ఏపీలో మనిషి మనిషిలా బతికే పరిస్థితి కనపడటం లేదు. ఏదో ఒక పార్టీ వైపో, ఏదో ఒక కులం వైపో ఉంటేనే మనుగడ అనే పరిస్థితి దాపురించింది. కులం తప్ప ఏపీలో ఏది చర్చకు రాని ఘోరమైన పరిస్థితి ఉంది. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై టీడీపీ ముద్ర, లేదంటే కమ్మకుల ముద్ర వేస్తున్నారు. న్యాయాన్యాయాలతో సంబంధం లేదు. 

ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, విమర్శించడం ఏపీలో పెద్ద నేరంగా పరిగణిస్తున్నారు. మీడియాకు స్వేచ్ఛ లేకుండా సంకెళ్లు వేస్తున్నారు. జగన్ వ్యతిరేక కథనాలు రాయడానికి ప్రధాన మీడియాలో భయపడే పరిస్థితి ఉంది. ఎందుకో ఎన్ని అరాచకాలు జరుగుతున్నా... కేంద్రం చాలా సైలెంటుగా ఉంది. 

ప్రజాస్వామ్యానికి, వాక్ స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు ఇక ఏపీలో సమాధి కట్టినట్టేనా?