త్వరలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజీనామా?

January 21, 2020

ఏమైంది? ఆయనెందుకు రాజీనామా చేస్తున్నారు? జగన్ తిట్టాడా? అని సర్ ప్రైజ్ అవుతున్నారా? జగన్ తిట్లు కారణం కాదు. ఏపీ ఆర్థిక పరిస్థితి... జగన్ పథకాలకు నిధుల విడుదల చేయడానికి తల ప్రాణం తోకలోకి వస్తోంది మంత్రి గారికి. ఖజానాలో డబ్బులు లేవు. సంపద సృష్టిలో ముఖ్యమంత్రి వెనుకపడుతున్నారు. కొత్త పరిశ్రమల రాక దేవుడెరుగు... ఉన్న పరిశ్రమలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. దీంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఆర్థిక శాఖ నిర్వహణ తీవ్ర ఒత్తిడితో ఉంది. చెబితే వినే ముఖ్యమంత్రి కాకపోవడంతో చెప్పడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. దీంతో ఈ మంత్రి పదవి కంటే దీనిని వదిలేయడమే మేలని బుగ్గన ఆలోచిస్తున్నారు. అయితే... మంత్రి పదవి నుంచి తప్పించుకోవడానికి సరైన కారణం కోసం ఆయన వెతుకుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.