కేసీఆర్ కు పీడ‌క‌ల‌ జూన్ 21 ?

May 25, 2020

జూన్ 20. ఇవాల్టి ఈ రోజు ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా తెలంగాణ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల్ని విప‌రీతంగా ప్ర‌భావితం చేయ‌టం ఖాయం. ఎవ‌రి క‌ష్టాన్ని క‌నిపించ‌కుండా చేశారో.. దానికి సంబంధించి మ్యూలం చెల్లించుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఒక బ‌హుళార్థ‌క సాధ‌క ప్రాజెక్టును ఏళ్ల‌కు ఏళ్లు నిర్మించే తీరుకు భిన్నంగా.. తెలుగు రాష్ట్రాల చ‌రిత్ర‌లో తొలిసారి.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో భారీ వ్య‌యంతో నిర్మించిన ప్రాజెక్టును పూర్తి చేయ‌టం మామూలు విష‌యం కాదు.
ఇవాల్టి రోజున ఒక పెద్ద నిర్మాణ వెంచ‌ర్ ను పూర్తి చేయ‌టానికి మూడు.. నాలుగేళ్లు ప‌డుతున్న వేళ‌..అంత‌కంటే త‌క్కువ స‌మ‌యంలో ఒక భారీ ప్రాజెక్టును పూర్తి చేయ‌టం ఒక ఎత్తు అయితే.. ఈ ప్రాజెక్టు సాంకేతిక అద్భుతంగా ప‌లువురు అభివ‌ర్ణించ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అన్నింటి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌గా ఉండే కేసీఆర్‌.. కొన్నింటి విష‌యంలో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
కాళేశ్వ‌రం ప్రాజెక్టు పేరు చెప్పినంత‌నే కేసీఆర్ పేరు ఎలా గుర్తుకు వ‌స్తుందో.. హ‌రీశ్ రావు పేరు అంతే ఎక్కువ‌గా గుర్తుకు వ‌స్తుంది. అయితే ఇంట్లో లేదంటే ఫాంహౌస్ లో కూర్చొని కాగితాల మీదా.. గూగుల్ మ్యాప్ ల మీద ప‌ని స‌ల‌హాలు ఇచ్చింది కేసీఆర్ అయితే.. వాటిని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేయ‌టంతో పాటు.. ప‌నిని ప‌రుగులు తీయించ‌టంతో పాటు.. సాంకేతిక అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం.. పొరుగు రాష్ట్రంలో ఉన్న పేచీల్ని గుట్టుచ‌ప్పుడు కాకుండా స‌ర్దుబాటు చేసిన స‌మ‌ర్థ‌త కేసీఆర్ మేన‌ల్లుడి సొంతం.
అలాంటి హ‌రీశ్‌ పేరు.. ప్ర‌స్తావ‌న అన్న‌ది తీసుకురాకుండా కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్న కేసీఆర్ తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. అయితే క్రెడిట్ త‌న‌కు కానీ.. త‌న కొడుక్కి కానీ రావాలే త‌ప్పించి మిగిలిన వారెవ‌రికీ రాకూడ‌ద‌న్న కేసీఆర్ తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హ‌రీశ్ ను తొక్కేసేందుకు ఎలాంటి మొహ‌మాటాల‌కు పోని కేసీఆర్ త‌త్త్వం రానున్న రోజుల్లో ఆయ‌న‌కు త‌ల‌నొప్పిగా మార‌తుందంటున్నారు. ఏ ఆలోచ‌న‌తో అయితే హ‌రీశ్ పేరు ప్ర‌స్తావ‌న లేకుండా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించారో.. అదే ఆయ‌న‌కు పీడ‌క‌ల‌గా మారుతుంద‌ని.. కాళేశ్వ‌రం ఓపెనింగ్ డేట్ చ‌రిత్ర‌లో నిలిచిపోతుందంటున్నారు. తెలంగాణ భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు జూన్ 20 ఒక ల్యాండ్ మార్క్ గా మారుతుంద‌న్న మాట వినిపిస్తోంది.