నిత్యానంద ‘కైలాస’ దేశం నిజం కాదా?

August 07, 2020

రెండు మూడు రోజులగా నిత్యానంద స్థాపించిన కొత్త దేశం గురించి వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. ప్రపంచంలో తొలి హిందు రాజ్యం అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యింది. కొందరు ట్రోల్ చేశారు, కొందరు ఆశ్చర్యపోయారు. ఇంకొందరు నవ్వుకున్నారు. ఏదైతేనేమి.. నిత్యానంద మూడు రోజులుగా ట్రెండ్ అయ్యాడు. చివరకు తేలిందంటే... దేశం లేదు, గీశం లేదు... అంతా ఉత్తిదేనట. ఈ విషయం ఇపుడు అధికారికంగా తెలిసింది.

ఇండియా నుంచి పారిపోయిన నిత్యానంద తనను శరణార్థిగా గుర్తించమని ఈక్వెడార్ దేశానికి వెళ్లి అడిగారట. వారు దానికి తిర్కరించారట. ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న ఈక్వెడార్ ఎంబసీ అధికారికంగా ప్రకటించింది. మా దేశానికి వచ్చినా మేము అతని ప్రతిపాదన ఒప్పుకోలేదని, అతనికి ఏ దీవినీ అమ్మలేదని ప్రకటించింది. అంటే ఇంతవరకు వస్తున్న వార్తలన్నీ ఉత్తుత్తివే. ఈక్వెడార్ తిరస్కరించడంతో నిత్యానంద హైతీ దేశానికి వెళ్లాడట. ఇది ఈక్వెడార్ పక్కనే ఉంటోంది. 

ఈక్వెడార్ ఎంబసీ ప్రకారం అయితే.. అతను ఏ హిందు దేశం పెట్టలేదు. కానీ హైతీ దీవుల్లో ఏమైనా పెట్టాడా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.