గుడ్ న్యూస్ - ఇండియాలో ఇక దానికి చెల్లుచీటి !

August 05, 2020

యుద్ధం చేయడం రాక ముందు భయపడాలి.

కానీ యుద్ధం చేయడం తెలిశాక... యుద్ధం చేయాలి.
 
కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం మనకు ఉందో లేదో తెలియని సమయంలో లాక్ డౌన్ పెట్టుకున్నాం. అపుడు మన వద్ద పీపీఈ కిట్ మేకింగ్ లేదు. టెస్ట్ కిట్ గురించి తెలియదు. మందు తెలియదు. ఎలా రక్షించుకోవాలో తెలియదు. అలాంటపుడు పానిక్ క్రియేట్ చేసుకోవడం కంటే దేశాన్ని బంద్ చేయడమే అసలైన మందు. 
 
కానీ ఇపుడు మనకు క్లారిటీ వచ్చింది. కరోనా గురించి, చికిత్స గురించి, మందు గురించి, దాని వ్యాప్తి గురించి... కాబట్టి ఈ దశలో మనతో పాటు మన దేశాన్ని బతికించుకోవాలి. బంద్ చేస్తే ఆగమైపోతాం. 
 
అందుకే కేసులు పెరుగుతున్నా... నో లాక్ డౌన్. జాగ్రత్తగా కరోనా నుంచి తప్పించుకుని తిరగడమే. కరోనా వందలో ఇద్దరినే చంపుతుంది. కానీ ఆర్థిక చావులు మొదలైదే వందకు 10 అయినా ఆశ్చర్యం లేదు కాబట్టి... ఆపగలిగిన కరోనా వ్యాప్తికి భయపడి... పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను చేజార్చుకోలేం. 
 
చివరకు ఇండియా సరైన నిర్ణయమే తీసుకుందనుకోవాలి. కేసులు పెరుగుతుండొచ్చు గాని మన అదుపులోనే ఉందా వ్యాధి. అందుకే లాక్ డౌన్లు ముగిసి అన్ లాక్ లు మొదలయ్యాయి. ‘‘దేశంలో లాక్ డౌన్ ల దశ ముగిసింది .అన్ లాక్ ల దశ ప్రారంభమయింది‘’ అని స్వయంగా ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. 
 
దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్ డౌన్ ముగిసింది. అన్ లాక్ 1.0 నడుస్తున్నది. ఇక వచ్చేవన్నీ అన్ లాక్ లే అంటూ మోడీ ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు. ఇక ముందు అన్నీ స్థానిక నిర్ణయాలే. 
 
130 కోట్ల భారతదేశం మనది. మనల్ని ఆదుకునే శక్తి మనకు తప్ప ఎవరికీ లేదు. అందుకే ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకుంటూనే కరోనా అంతు చూడక తప్పదు. ఇదే కేంద్రం ఫైనల్ గా డిసైడ్ చేసింది.