జగన్ నోరు జారి దొరికిపోయాడా? !!

August 13, 2020

ప్రత్యేక హోదా తెస్తాను నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి అని జగన్ ఇచ్చిన హామీ అబద్ధమని స్వయంగా జగన్ నిరూపించారు. మీరు ఈసారి నేను అడిగినన్ని ఎంపీ సీట్లు ఇచ్చినా 2024లోపు తాను ప్రత్యేక హోదా తేలేను అని జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. 

మోడీ ప్రధాన మంత్రి. ఆయనకు సొంత మెజారిటీ ఉంది. నా ఎంపీ సీట్లతో ఆయనకు పనిలేదు. అందుకే ప్రత్యేక హోదాను నేను అడగలేను. అడిగినా ఆయన ఇవ్వరు అని జగన్ స్పష్టంగా వివరించారు.

భవిష్యత్తులో (2024 కావచ్చు, 2029 కావచ్చు) మన మీద ఆధారపడే ప్రభుత్వం వస్తుంది. మనకు అపుడు కూడా భారీ సీట్లు వస్తాయి. మన ఎంపీ సీట్లు అవసరం పడతాయి. అపుడు నేను ప్రత్యేక హోదా తెస్తాను. కచ్చితంగా వస్తుంది అని జగన్ అన్నారు.

సింపుల్ గా చెప్పాలంటే... 2024 లో సొంత మెజారిటీ ఎవరికి వచ్చినా మళ్లీ ప్రత్యేక హోదా అడగొద్దు అని క్లియర్ గా చెబుతున్నాడు జగన్. మన అదృష్టం మీద ప్రత్యేక హోదా తేగలడు గాని ఆయన బలంతో తేలేడు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేశాడు. 

కొసమెరుపు - 2014లో మోడీకి సొంత మెజారిటీ ఉన్నా చంద్రబాబు ప్రత్యేక హోదా తేవడంలో మోసం చేశాడట. 2019లో మోడీకి సొంత మెజారిటీ ఉండటం వల్ల తాను ఫెయిలయ్యాడట.... ఇది మీకేమైనా అర్థమైతే మాకు చెప్పండి. ఓ రేంజ్ నాలెడ్జ్ సామీ జగన్ నీది.