అమరావతికి సుజనా చౌదరి గుడ్ న్యూస్

August 15, 2020

అమరావతి విషయంలో సుజనచౌదరి పెద్ద వార్త మోసుకొచ్చరు. అమరావతియే ఏపీకి రాజధాని అని మరోసారి బల్ల గుద్ది చెప్పారు. ఏపీ రాజధానిని అమరావతి నుంచి ఎవరూ మార్చలేరని ఆయన ఖరాఖండిగా తేల్చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు అసెంబ్లీలో రెండు సార్లు బిల్లు పెట్టి... విశాఖలో బిల్డింగులు సిద్ధం చేస్తున్నా... సుజనా చౌదరి మాత్రం అదే జరగదు అంటున్నారు.

కరోనా వల్ల గాని, కోర్టు వల్ల గాని అమరావతి ఆగడం కాదు... సరైన సమయంలో కేంద్రం జోక్యం ఉంటుంది. అమరావతి నుంచి రాజధాని మారే ప్రసక్తే లేదు అని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజన చౌదరి మరోసారి స్పష్టంచేశారు. 

గతంలో ఆయన ‘రాజధాని అమరావతి నుంచి అంగుళం కూడా కదలదు’ అని ఒకసారి ప్రకటించారు. ఆయన చెప్పినట్లే తాత్కాలిక కొన్నిఅడ్డంకుల వల్ల అమరావతి ఆగిపోయింది. 

తాజాగా అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి 200 రోజులు పూర్తి అయిన సందర్భంగా సుజన చౌదరి మరోసారి అమరావతిపై క్లారిటీ ఇచ్చారు.

ఆయన ఏమని స్పందించరాంటే... ‘‘నేను గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది.’’ అని సుజనా ట్వీట్ చేశారు. 

మరి సుజనా మాటలు ఓకే గాని నిజంగా బీజేపీ ఏదైనా చేసేలా ఉంటే ఇపుడే చేసి అమరావతి రైతులకు కాస్త మనశ్శాంతి ప్రసాదించొచ్చు కదా.