ఏపీలో హీరోలు ఎవరూ లేరా?

August 14, 2020

ముంబై ఎక్కడ? చిత్తూరు ఎక్కడ?

దూరం మనుషుల మధ్య ఉంటుంది గాని మనసుల మధ్య ఉండదు

చిత్తూరుకు చెందిన కడు పేద కుటుంబం పొలం దున్నడానికి ఎద్దులు లేకపోవడంతో అక్కచెళ్లెళ్లు కాడెద్దులై పొలం దున్ని తండ్రికి సాయం చేసిన వీడియో జాతి మొత్తం చూసింది. మిలియన్ల సంఖ్యలో ప్రజలు ఆ వీడియోను వీక్షించారు. ఇంటర్నెట్లో రెండు రోజులుగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలో కొందరు ఆ వీడియోను సోనుసూద్ కు ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన సోను సూద్ వారికి ట్రాక్టరు పంపించారు.

ఇది పక్కన పెడితే... దేశంలో ఉన్నది ఒకడే హీరోనా !

మన తెలుగు రాష్ట్రంలో హీరోలు లేరా?

ఎక్కడో సుదూరాన ఉన్న పరభాషా మనిషి సోను సూద్ ను స్పందింపజేసిన ఆ వీడియో ఉపన్యాసాలిచ్చే మన తెలుగు హీరోలను స్పందింపజేయలేదా? కోట్లకు పడగనెత్తిన వీరు తమ ఆస్తినంతా పేదలకు దానం చేయమని ఎవరూ అడగరు. ఇలాంటి సాయాలు చేస్తే మళ్లీ రిక్వెస్టులు వచ్చే అవకాశం ఉందని వాదన వినిపించొచ్చు. 

కానీ రెండెద్దులు ఎంతవుతాయి. మహా అయితే లక్ష రూపాయలు.

ఆ మాత్రం సాయం చేయడానికి ముంబై నుంచి సోను సూద్ రావాలా?

గుప్తదానం కూడా చేయొచ్చు కదా... ఎవరో తెలియకుండా సాయం చేయొచ్చు కదా

సరే సెలబ్రిటీలను పక్కన పెడదాం. పాలకులకు ఏమైంది?

సంక్షేమ రాజ్యం అని చప్పట్లు కొట్టించుకోవడమేనా... కంటిని చెమర్చే ఇలాంటి వాటికి హృదయం స్పందించదా? 

ఏమిటో లోకం.. ఎటు పోతున్నాం... సాయం అంటే వారికి ఎడ్లనే కొనివ్వక్కరలేదు. ఆ పొలం దున్నడానికి ముందుకు డబ్బులు ఇచ్చినా సాయమే అది. పంటలో వచ్చిన నాల్రూపాలతో వచ్చే పంటలకు వారు జీవితం మెరుగుపడొచ్చు.

రైతు జీవితం నానాటికీ లాటరీ టికెట్ అయిపోతోంది.

 

పాలకులు ఎందరు మారినా వారి జీవితాలు మారడం లేదు