సీఎం రమేషా... మజాకా? !

January 23, 2020

బీజేపీ పార్టీలో చేరిన నలుగురు ఎంపీల్లో సుజనా చౌదరి మాత్రం అధికంగా తెరపై కనిపిస్తున్నారు. మిగతా వాళ్లు చాలా అరుదుగా బయటకు వస్తున్నారు. పార్టీ మారారు. ఇక ఎంతకాలం అని దాచుకుందాం.. అయ్యిందేదో అయిపోయిందన్నట్టు మొన్ననే టీజీ బయటకు వచ్చారు. తాజాగా సీఎం రమేష్ కడపలో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాజకీయ ప్రవచనాలు చేశారు. ప్రవచనాలు అని ఎందుకనాల్సి వచ్చిందో... ఆయన మాటలు వింటే మీకే అర్థమవుతుంది. 

అరేబియన్ గుర్నాన్ని అప్పనంగా ఎందుకలా వేరే వాళ్లకు ఇచ్చేశావంటే... దాన్ని కట్టేయడానికి తాడు లేదు అన్నాడట వెనకటికి ఎవడో. అలానే ఉంది బీజేపీ ఎంపీ రమేష్ మాటలు. టీడీపీ వదిలేయడానికి కారణమేంటని మీడియా వాళ్లు అడిగితే... ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదట. మూడేళ్లలో వైసీపీ, టీడీపీ అంతరిస్తాయట. అంటే...బీజేపీ అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి వస్తుందని సీఎం రమేష్ కలలు కంటున్నట్లు ఉంది. 

అవును మరి... మొన్నటి ఏపీలో అత్యధిక ఓటర్లు బీజేపీ వైపు నిలిచారు కదా... అందుకనే పాపం అతనికి అలా అనిపించి ఉండొచ్చు. అయినా.. టీడీపీ వదిలేయడానికి కారణాలు అడిగితే ఆ ప్రశ్న అవాయిడ్ చేయొచ్చు, లేదా ఇంకేదైనా చెప్పొచ్చు. మరీ జనం నవ్వుకునే ఇలాంటి కారణాలు ఎందుకు చెప్తారు రమేష్ గారు? 

Read Also

పాలన తెలియని అజ్జాని - జగన్ పై బాబు ఫైర్
జ‌గ‌న్‌కు మాజీ ఎంపీ వింత సూచ‌న‌...
జగన్ దిగిరాక తప్పలేదు... ఇదే రీజన్