జగన్ దెబ్బ... అందరూ కెవ్వు మన్నారుగా

February 27, 2020

రాష్ట్రానికి ప‌వ‌ర్ క‌ట్ అయింది. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా ఏపీ క‌రంట్ క‌ష్టాల‌ను ఎదుర్కొంటోంది. క రంట్ కొన‌కుండా రాష్ట్రంపై నిషేధం విధించ‌డం, ఈస‌మ‌యంలోనే విద్యుత్‌ ఎక్స్చేంజ్ త‌లుపులు మూ సివేయ‌డంతో ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది. దీనికి తోడు థ‌ర్మ‌ల్ కేంద్రాల‌కు బొగ్గు స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డం మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌రెంట్ స‌మ‌స్య‌పై ప‌లు గ్రామాల‌ల్లో రైతులు ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు.
ఇంత‌లా ఏపీని క‌రంట్ క‌ష్టాలు చుట్టుముట్ట‌డానికి కార‌ణం...  దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు విద్యుత్‌ కొనుగోళ్లు, అమ్మకాలు జరిపే వేదిక విద్యుత్‌ ఎక్స్చేంజ్ అని తెలుస్తోంది. ఈ ఎక్స్చేంజ్‌లో ఏపీపై గత కొన్నిరోజులుగా నిషేధం అమలవుతోంది. మన ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలు విద్యుత్‌ కొనుగోలు చేయకుండా తలుపులు మూసివేశారు. రాష్ట్రానికి ఈ పరిస్థితి ఉత్పన్నం కావడం ఇదే ప్రథమం. దక్షిణాది ప్రాంత లోడ్‌ డిస్పాచి సెంటర్‌ వెబ్‌సైట్‌లో ఏపీకి చెందిన విద్యుత్‌ పంపిణీ సంస్థలను బ్లాక్‌ చేసినట్లు నోటిఫికేషన్ వెలువ‌డింది.  ఈ వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలు ఎల్‌సీలు (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) మంజూరు చేయకపోవడమే ఈ పరిణామానికి కారణమ‌ని తెలుస్తోంది. కేంద్రం కొత్తగా తెచ్చిన విధానం ప్రకారం విద్యుత్‌ సరఫరా చేసే సంస్థలకు ముందుగానే రాష్ట్ర ప్ర భుత్వాలు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఏపీ ప్ర‌భుత్వం ఈ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైన‌ట్లు స‌మాచారం.
ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కో ఆధీనంలోని ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు ఒడిశాలోని మహానది బొగ్గు గనుల నుంచి బొగ్గు అధికంగా స‌ర‌ఫ‌రా అవుతుంది.  అయితే   అక్కడి కార్మికుల ఆందోళనతో కొన్ని రోజులుగా బొగ్గు సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయంగా తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నుంచి రోజూ కొన్ని రైలు ర్యాక్‌ల ద్వారా బొగ్గు తెప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నా చాలడంలేదు.

సాధారణంగా ప్రతి ధర్మల్‌ కేంద్రంలో ఏడు రోజులకు సరిపోను బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ముద్దనూ రులోని రాయలసీమ ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో ఒక రోజుకు సరిపోను కూడా నిల్వలు లేవు. మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి నెల‌కొంది. ఫ‌లితంగా రోజులో మూడు, నాలుగు గంటలపాటు అనధికార కోతలు రాష్ట్రంలో అమలవుతున్నట్లు విద్యుత్‌ వర్గాలు వెల్లడించాయి.