దేశంలో జీరోకి చేరిన వ్యభిచారం !

August 04, 2020
CTYPE html>
మనకు పురాణాలు, చరిత్ర తెలిసినప్పటి నుంచి ఈలోకంలో నిరాటంకంగా కొనసాగుతున్న వ్యాపారం ఏదైనా ఉందంటే... అది వ్యభిచారమే. వేల యేళ్లుగా ఏ మాత్రం చెక్కు చెదరని వేశ్యా వృత్తి మానవ చరిత్రలో మొదటి సారి ఆగిపోయింది. కరోనా దెబ్బకు పరిచయం ఉన్న మనిషితో మనం చేయి కలపడానికి భయపడే ఈ కరోనా రోజుల్లో శృంగారానికి ఛాన్సే లేదు. దీంతో భారతదేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే వ్యభిచారం జీరోకి చేరింది. 
ఒక అధికారిక అంచనా ప్రకారం దేశంలో సెక్స్ వర్కర్ల సంఖ్య 8 లక్షలు ఉండగా... రహస్యంగా ఈ పని చేసే వారిని కూడా కలుపుకుంటే 50 లక్షల దాకా ఉండొచ్చు అంటున్నారు. అంటే కరోనా వల్ల 50 లక్షల మంది వేశ్యలు సుమారు 6 నెలల పాటు పూర్తి ఆదాయాన్ని కోల్పోయారు. రెడ్ లైట్ ఏరియాల్లో సెక్స్ వర్కర్లుగా ఉండేవారికి ఎలాగోలా పూట గడుస్తుంది. ఎందుకంటే గవర్నమెంటు వారికి ఆహార సదుపాయం కల్పిస్తోంది. కానీ ప్రైవేటు బ్రోకర్లతో వాట్సాప్ ల ద్వారా రహస్యంగా వ్యవహారం నడిపే వారి ఆదాయం జీరో అయ్యింది. వీరిలో అత్యధికులు పేదరికం వల్ల, ఇంట్లో ఎడతెగని ఆర్థిక అవసరాల వల్ల ఈ వృత్తిలోకి వచ్చిన వారే. ఎవరూ సరదాగా ఈ వృత్తిలోకి రారు. వచ్చినా కొంతకాలం కూడా ఉండలేరు. 
దుర్భరమైన విషయం ఏంటంటే... వీరికి ఇపుడు రూపాయి పుట్టదు. తాము వేశ్యలం మా ఆదాయం పోయింది ఆదుకోండి అని ఎవరికీ చెప్పుకోలేరు. ఎక్కడెక్కడో నగరాల్లో ఉంటూ ఈ పనిచేస్తున్న వారు సొంతూరికి వెళ్లలేరు. వెళ్లే మార్గం లేదు. దీంతో ఆకలితో... చేతిలో ఉన్న డబ్బులు అయిపోతే... ఎలా బతకాలో తెలియని అయోమయ దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు అయినా ఎండ వానలో పని అలవాటు కూడా వందల కిలోమీటర్లు నడుచుకుని సొంతూరి బాట పట్టారు. వీరికి అది కూడా చేతకాదు.  దీంతో తమలో తామే కుమిలిపోతు.. నరకయాతన అనుభవిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బహుశా సమీప భవిష్యత్తులో దేశం పూర్తిగా కరోనాపై విజయం సాధించేవారికి వీరి జీవితాలు శూన్యం. ఈ సంధి కాలంలో ఎన్ని ప్రాణాలు గాల్లో కలుస్తాయో?