జగన్, ఇదీ నీ రేంజ్... అర్థమవుతోందా !

June 01, 2020

పొద్దున లేస్తే సోషల్ మీడియాలో పొగిడితే నిజమైపోదు

ప్రజల సొమ్మును నచ్చిన వారికి పంచితే నాయకుడైపోడు

అధికారులను బూతులతో బెదిరిస్తే బలవంతులైపోరు

ప్రపంచం ముందు నువ్వు, నీ రాష్ట్రం, నీ పౌరుడు నిలబడినపుడు ... దక్కే విలువ నీ దమ్మేంటో ప్రపంచానికి చెబుతుంది. ఈరోజు జగన్ దమ్మేంటో ప్రపంచానికి తెలిసిపోయింది. ఏపీ బ్రాండ్ వాల్యూ ఎంత దిగజారిందో సాక్ష్యాధారాలతో సహా ప్రపంచానికి తేటతెల్లం అయిపోయింది. అది ఎలా జరిగిందో తెలుసుకుందాం.

కరోనాతో అన్ని ఆర్థిక వ్యవస్థలు లాక్ డౌన్ అయిపోయాయి. ఖజానా నుంచి కోట్లు పోతున్నాయి కానీ రూపాయి కూడా రావడం లేదు. దీంతో ఎక్కడ డబ్బు దొరికితే అక్కడ తెచ్చుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు బాండ్ల రూపంలో నిధులు సేకరించడానికి పూనుకున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి. RBI వెబ్ సైట్ ద్వారా బాండ్లను అమ్మకానికి పెడితే తెలంగాణకు విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. కానీ అందులో నాలుగో వంతు రెస్పాన్స్ కూడా బొటాబొటిగా వచ్చింది ఏపీ బాండ్లకి. సంక్షేమ పథకాలు తప్ప ఏమైనా ఏపీలో ఆదాయం పుట్టే పని, పథకం చేస్తుంటే విలువంటూ ఉంటుంది. అదేమీ లేకపాయె. మరి ఏ నమ్మకంతో జనం ఏపీ బాండ్లను కొంటారు? 

తెలంగాణ ప్ర‌భుత్వ బ్రాండ్లను కొన‌డానికి సంస్థ‌లు ఎగ‌బ‌డ‌గా.. రూ.2 వేల కోట్ల‌ను స‌మీక‌రించ‌గలిగింది. 262 సంస్థ‌లు తెలంగాణ బాండ్ల కోసం బిడ్‌లు దాఖ‌లు చేశాయి. ఏపీ బాండ్ల కోసం కేవలం 63 సంస్థ‌లు మాత్ర‌మే బిడ్‌లు దాఖ‌లు చేశాయి. దీంతో 500 కోట్లు అయినా వస్తుందో రాదో తెలియని పరిస్థితి. జగన్ సర్కారుకు ఈ అవమానం కొత్త కాదు. మార్చి 31కు ముందు కూడా ఈ ప్రయత్నం చేసింది. వెయ్యి కోట్లకు బాండ్లు విడుదల చేస్తే 50 కోట్లు మాత్రమే స్పందన రావడంతో అది కూడా సమీకరించుకుండా వెనుదిరిగింది. ఇపుడు వచ్చిందే పరమాన్నంలాగ ప్రభుత్వం భావించి సమీకరిస్తోంది.  గతంలో చంద్రబాబు ఉన్న సమయంలో అమరావతి బాండ్లు విడుదల చేస్తే నిమిషాల్లో 2 వేల కోట్లు వచ్చిపడ్డాయి. నాటికి నేటికి ఎంత మార్పో. 

నాయకత్వం లోపం ఉంటే రాష్ట్రం విలువ ఎలా తగ్గుతుందో చెప్పడానికి ఇదో నిదర్శనం.