చంద్రబాబు సరే.. ఇప్పుడు జగన్ సంగతేంటి మరి?

July 03, 2020

చంద్రబాబు 29సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం చేశారని.. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ పలుమార్లు ప్రశ్నించారు. ఇప్పుడు అవే వ్యాఖ్యలు టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో దాదాపు ఏడుసార్లు హస్తిన పర్యటన చేశారు. ఏపీకి కేంద్రం సాయం విషయంలో నాడు వైసీపీ వాడిన అస్త్రాన్నే ఇప్పుడు టీడీపీ ఉపయోగిస్తోంది. 

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాను 29సార్లు ఢిల్లీకి వెళ్లానని, కేంద్రాన్ని సాయం కోరానని చెప్పారు. ఐతే, అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత కేంద్రం నుంచి తీసుకు వచ్చింది ఏమీ లేదని, ప్రత్యేక హోదా కూడా సాధించలేకపోయారని విమర్శలు గుప్పించింది. ఇప్పుడు అదే జగన్‌కు రివర్స్ అయింది.

జగన్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లినా.. ఏపీకి సాధించిందేమీ లేదని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు. హోదా ఏమయిందని, కనీసం బడ్జెట్‌లో కూడా ఏపీకి న్యాయం జరగలేదని, అలాంటప్పుడు జగన్ ఇన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని నిలదీస్తున్నారు. ఇటీవలి బడ్జెట్‌లో రాష్ట్రానికి ఆశించిన నిధులు రాలేదని, దీనిపై వైసీపీ నుండి ఆశించిన స్పందన లేదని, హోదాపై ఎన్నికలకు ముందు పార్లమెంటును స్తంభింప చేస్తామని ప్రకటనలు గుప్పించిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు మౌనంగా కూర్చుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

గతంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేసిన వైసీపీ ఇప్పుడు జగన్ గురించి ఏం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. అసలు హస్తిన పర్యటనను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని, తన కేసుల గురించే కేంద్రం పెద్దలను కలుస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేశారని టీడీపీ సీనియర్ నేత యనమల. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా ఆయన కేంద్రం నుండి ఒక్క పైసా తేలేదని విమర్శించారు. 

Read Also

ఢిల్లీలో బీజేపీ ఓటమికి కారణం కనిపెట్టిన అమిత్ షా
శాసన సభ, మండలి ప్రొరోగ్: ఆ రెండు బిల్లుల ఆర్డినెన్స్‌కు జగన్‌కు ఛాన్స్
సాల్లేబ్బా నీ సంబడం... ఐవైఆర్