ప్రభాస్ కు జగన్ భారీ ఝలక్

July 15, 2020

సాహోతో చెలరేగిపోతున్న ప్రభాస్ కు జగన్ పెద్ద బ్రేక్ వేశారు. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ తో నే భయటపడిపోదాం అన్న సినిమా నిర్మాతల స్వార్థానికి ఏపీ సర్కారు బ్రేక్ వేసింది. ఒక్కోసినిమాకు ఒక్కో రేటు ఉండటం సరైనది కాదని... ఈ ప్రతిపాదన తీసుకెళ్లిన అధికారులకు జగన్ స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో చిత్ర నిర్మాతలు నిరుత్సాహపడ్డారు.

అయితే, ఈ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం కూడా మంచిదే. ఆదరణ ఉండే పెద్ద సినిమాలకు ఇష్టానుసారం టిక్కెట్ పెంచుకునే హక్కు ఇచ్చి... చిన్న వాటిని మాత్రం నిబంధనల్లో ఇరికించిడం కరెక్టు కాదు. ఇప్పటికే హైకోర్టులో కూడా సాహోకు ఈ విషయంలో దెబ్బ తగిలింది. తాజాగా జగన్ నిర్ణయం వారికి మరో దెబ్బ. 

ఈ సినిమాకే కాదు, ఇక నుంచి ఏపీలో ఏ సినిమాకు అయినా... ఒకటే ధర పద్ధతి కొనసాగనుందని తెలుస్తోంది. ప్రత్యేక రిక్వెస్టులు ఏమీ చెల్లవని తెలుస్తోంది. కేవలం సామాజిక ప్రయోజనాలు, బాలల చిత్రాలు, మహిళా స్వావలంబన చిత్రాలకు మినహాయింపు ఉండొచ్చు. సాధారణ కమర్షియల్ సినిమాలకు మాత్రం అన్నిటికీ ఒకటే పద్ధతి పాటించే అవకాశం కనిపిస్తోంది.