సుప్రీంషాక్ - నిమ్మగడ్డ రమేష్ ఎస్ఈసీయే

August 07, 2020

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా ఉండకూడదు కాబట్టి హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని  ఏపీ ప్రభుత్వ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు అసలు ఆ పదవి ఖాళీగా ఎక్కడుందని పిటిషనరును ప్రశ్నించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్నియమించాలంటూ హైకోర్టు తీర్పు చెప్పినందున అది ఖాళీ ఎలా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో నిమ్మగడ్డను ఎస్ ఈ సీగా సుప్రీంకోర్టు గుర్తించినట్లయ్యింది. అయితే, ప్రభుత్వం అతనికి నియామక ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో సుప్రీంతాజా వ్యాఖ్యలతో ఏపీ నిమ్మగడ్డను అధికారికంగా ప్రకటించక తప్పదు. ఇక ఏపీ ప్రభుత్వం స్టే ఇవ్వాలని కోరగా ఆల్రెడీ 15 రోజుల క్రితం చెప్పాం కదా స్టే కుదరదు అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది. 

కరోనా నేపథ్యంలో ఏపీలో ఎన్నికలలు వేయిదా వేసిన కారణం చేత కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పై ఏపీ సీఎం మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేశారు. కుల ఆరోపణలు చేశారు. ఆర్డినెన్స్‌ తెచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం కనగరాజ్ ను నియమించింది.

దీంతో నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అసలు కనగరాజ్ ఉనికినే హైకోర్టు గుర్తించలేదు. ఆర్డినెన్సును కొట్టేసింది. దీంతో ఆటేమేటిగ్గా నిమ్మగడ్డ కమిషనర్ గా కొనసాగుతున్నట్లయ్యింది. సుప్రీంకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి అక్కడా ఎదురుదెబ్బ తగిలింది.