గవర్నమెంట్ చేతిలో ఉన్నా... జగన్ ఆ పనిచేయట్లేదే

August 11, 2020

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం... రాష్ట్రంలోనే ఇటీవల సంచలన కేసు. అత్యంత అనుమానాస్పందంగా జరిగిన ఈ మరణంపై అప్పట్లో వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వానికి ముడిపెట్టింది. అందుకే నిజనిర్దారణకు సీబీఐ విచారణ చేపట్టాలని జగన్ డిమాండ్ చేశారు. అయితే... అప్పట్లో జగన్ బ్యాచ్ వ్యవహరించిన తీరు అందరికీ విస్మయంగా అనిపించింది. వివేకానంద కూతురు సునీత పోలీసుల విచారణపై తొలుత సంతృప్తి వ్యక్తపరిచి అనంతరం అసంతృప్తి వ్యక్తంచేసింది. అంతలోనే ఏమైందో తెలియదు. ఉదయం సాక్షిలో గుండె పోటు అని వేశారు. మధ్యాహ్నం హత్య అని రాశారు. పొద్దున సాయిరెడ్డి వెర్షను, సాయంత్రం సాయిరెడ్డి వెర్షను రెండూ వేర్వేరు. ఇదంతా ఒకెత్తు. సునీత వారానికి రెండు ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా తేల్చరా అని గవర్నమెంటును నిందించేది. కట్ చేసే వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇపుడు ఈ ప్రశ్నలు ఏపీ ప్రజలను వేధిస్తున్నాయి.

1. వైఎస్ వివేకా కేసును ఎందుకు జగన్ సీబీఐకి ఇవ్వడం లేదు.
2. 60 రోజులు అయినా పోలీసులు దీనిపై ఎందుకు మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించలేదు?
3. వారానికి రెండు మూడుసార్లు కేసు పురోగతి గురించి ఏడ్చిన సునీత... ఎందుకు 60 రోజులుగా మాట్లాడలేదు?
4. ఫలితాలకు ముందు పోలీసులు మాట్లాడుతూ దర్యాప్తు చాలావరకు పూర్తయ్యింది త్వరలో వివరాలు వెల్లడిస్తాం అన్నారు. ఇంతవరకు ఎందుకు వివరాలు చెప్పలేదు?
5. అసలు ఈ కేసులో ఏ పురోగతి కనిపించకపోవడానికి కారణం ఏంటి?