ఇంట్రెస్టింగ్ : ఏపీలో ఎన్నారై ప్ర‌చార ర‌థాలు!

August 06, 2020

* జెండా ఊపి ప్రారంభించిన‌ రాయపాటి, డాక్టర్ అరవింద బాబు

తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన ఎల్ఈడీ ప్రచార రథానికి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ అరవింద బాబు జెండా ఊపి ప్రారంభించారు. నరసరావుపేట పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌ఫున ఈ ర‌థం ప్ర‌చారం చేయ‌నుంది. ఎంఆర్ఓ ప్రచార కార్యక్రమం జిల్లా సమన్వయకర్తలు డాక్టర్ రాయపాటి శైలజ, మేదరమెట్ల మల్లికార్జున్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఐటీ రంగంలో చేసిన అభివృద్ధి కారణంగా లక్షలాదిమంది విదేశాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పోలవరం నిర్మాణం రాజధాని నిర్మాణం జరగాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో 12 ప్రచార రథాలు ఏర్పాటు చేశామని నరసరావుపేట కు ఒక వాహనాన్ని పంపామని ప్రకటించారు. ఎన్నారై లతో సంబంధిత గ్రామస్తులను ప్రచార వాహనం లో ఎల్ఈడీల ద్వారా అనుసంధానించి టిడిపి ప్రభుత్వం ఆవశ్యకతను వివరిస్తామని తెలిపారు. టీడీపీ సాధించిన విజ‌యాలు, భ‌విష్య‌త్తులో చేయ‌బోయే కార్య‌క్ర‌మాలు వివ‌రించి చెబుతాం అన్నారు.

తన ప్రత్యర్థి లావు కృష్ణదేవరాయలు చేస్తున్న ఆరోపణలకు ఎంపీ రాయపాటి స్పందిస్తూ అతను చిన్నవాడని, ఆతను చేస్తున్న ఆరోపణలను ఘాటూగా విమర్శించే అవసరం లేదని, తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలియకపోవటం అవివేకానికి నిదర్శనం అని తెలుపుతూ ఈ సందర్భంగా రాయపాటి గత తన ఐదేళ్లలో పార్లమెంట్ సభ్యునిగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

* వినుకొండ, మాచర్ల మరియు గురజాల నియోజకవర్గాల్లో 600 కోట్లతో మూడు వాటర్ గ్రిడ్లు ఏర్పాటు.
* అనుపు, కొప్పునూరు ఎత్తిపోతల పథకం 100 కోట్లు, పదివేల ఎకరాల సాగు.
* దుర్గిలో పూర్తి అయిన మార్కెట్ యార్డు నిర్మాణం.
* వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల పట్టణాల్లో 312 కోట్లతో మంజూరైన త్రాగునీటి పధకాలు.
* చిలకలూరిపేట పట్టణంలో 139 కోట్లతో త్రాగునీటి పధకం మంజూరు. పధకం పూర్తి.
* యడ్లపాడు మండలం మైదావోలు వద్ద సుగంధద్రవ్యాల పార్క్ ఏర్పాటు.
* నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే పనులు తోలి దశ పూర్తయ్యేలా ఒత్తిడి తేవ‌డం.
* నరసరావుపేట ప్రకాష్ నగర్ లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం త్వ‌ర‌గా పూర్తిచేయించ‌డం.
* దుర్గి మండలం ధర్మవరం దత్తత, 10 కోట్లతో 100 ఎకరాల చెరువు సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, 36 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు.
* దేశంలోని ప్రఖ్యాత కంపెనీల నుండి 30 కోట్ల సీఎస్సార్ ర్ నిధులు మంజూరు.
* సత్తెనపల్లి - క్రోసూరు మార్గంలో 70 కోట్లతో రైల్వే బ్రిడ్జి మంజూరు.

* పేరేచెర్ల – కొండమోడు రోడ్డు 4 వరుసలుగా విస్తరణ
* నరసరావుపేటలో జె ఎన్ టి యు యూనివర్సిటీ ఏర్పాటు.
* సత్తెనపల్లి, చిలకలురిపేట ల్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు
* గోదావరి -కృష్ణా నదులను పట్టిసీమ నీటితో అనుసంధానం చేసిన కారణంగా కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.
* అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. వైకుంఠపురం నుండి నకరికల్లు వద్ద వరకు నీటిని తరలించి నాగార్జునసాగర్ కాలువలకు నీటిని మళ్ళిస్తారు. దీని కారణంగా గుంటూరు ప్రకాశం జిల్లాలోని నాగార్జున సాగర్ కుడికాలువ క్రింద ఉన్న 9 లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఎన్నారై ఎలక్షన్ క్యాంపైన్ కో ఆర్డీనేటర్ రాయపాటి శైలజ, కూరపాటి శివరాం(లండన్), డాక్టర్ లోకేష్ , డాక్టర్ వేణుగోపాల్, మల్లిక్, ఎర్రం సునీల్, మలినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.