ఎన్నారై యువ‌తి మ‌ర్డ‌ర్ - నిందితుడెవ‌రు?

August 14, 2020

విదేశాల‌కు ఎన్నో క‌ల‌ల‌తో వెళ్తున్న భార‌తీయులు ప‌లువురు ఈ మ‌ధ్య మృత్యువాత ప‌డ‌టం శోచ‌నీయం. తాజాగా తెలుగు డాక్ట‌రు ఆస్ట్రేలియాలో హ‌త్య‌కు గుర‌య్యింది. ఆమె క‌నిపించ‌కుండాపోయిన అనంత‌రం కారులో శ‌వ‌మై దొరికింది. అది కూడా దండుగులు దారుణంగా ఆమెను చంపేసి సూట్‌కేసులో పెట్టి కారులోనే వ‌దిలేశారు. ఈ కారు మంగ‌ళ‌వారం రాత్రి పోలీసులు గుర్తించారు.

ఈ హ‌త్య‌కు గుర‌యిన డాక్ట‌రు డెంటిస్ట్‌ ప్రీతిరెడ్డి అని పోలీసులు గుర్తించారు. ఆమె సిడ్నీలో నివ‌సిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రీతిరెడ్డి మాజీ ప్రియుడు హర్షవర్ధన్ కూడా రోడ్డు ప్రమాదంలో అదే స‌మ‌యంలో చనిపోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఇది యాక్సిడెంట్ కాద‌ని, అత‌ను ప్ర‌మాదం రూపంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని తెలుస్తోంది. మ‌రి నిజంగానే హ‌ర్ష‌వ‌ర్ద‌నే ఆమెను చంపి దొరికిపోతాన‌ని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా? లేక ఇందులో ఇంకెవ‌రి హ‌స్త‌మయినా ఉందా అన్న‌ది తేలాల్సి ఉంది.  ఏదేమైనా దేశం కాని దేశంలో మ‌న వాళ్లు ఇలా చ‌నిపోవ‌డం విచార‌క‌రం.