అమెరికాలో ఆ ముగ్గరు ఇండియన్స్ చనిపోవడానికి కారణమేంటి

August 12, 2020

(above photo : Relative of dead)

ఇది ఒక అనూహ్యమైన చేదు వార్త. అమెరికాలో స్థిరపడిన ముగ్గురు ఎన్నారైలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. అయితే, ఆ ముగ్గురు ఒకే కుటుంబం వారే కావడం గమనార్హం. న్యూజెర్సీలోని ఈస్ట్ బ్రున్స్విక్ లో జరిగిన ఈ ఘటన ఎన్నారైలను తీవ్రంగా కలచివేసింది.

చనిపోయిన వారిలో 8 సంవత్సరాల చిన్నారి, ఆ చిన్నారి తల్లి, చిన్నారి తాత ఉన్నారు. వీరి ముగ్గురు మృతదేహాల్లో స్విమ్మింగ్ ఫూల్ లో తేలుతూ ఉన్నాయి. అమెరికా అధికారులు చేసిన శవ పరీక్షల్లో వీరు ముగ్గురు ప్రమాదవ శాత్తూ చనిపోయినట్లు తేలింది. 

చనిపోయిన వ్యక్తి భరత్ పటేల్ (62) ఆయన కూతురు నిషా పటేల్ (33) చిన్నారి చనిపోగా... వీరు ఆ ఇంటికి కేవలం 20 రోజుల క్రితమే వచ్చినట్లు అధికారులు చెప్పారు. బహుశా పాప పొరపాటున స్విమ్మింగ్ పూల్ పడగా... చిన్నారి రక్షించే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు మృతి చెంది ఉండొచ్చంటున్నారు. ఆ ఇంట్లో ఏవో అరుపులు వినిపిస్తున్నాయని పొరుగింటి  నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. అయితే పోలీసులు చేరుకునేలోపు వారు అప్పటికే మరణించారు.